హైదరాబాద్ : వనపర్తి జిల్లా(Wanaparth) కాంగ్రెస్ పార్టీలో(Congress) చేరికల చిచ్చు రాజుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో పలువురు చేరడంతో ఆ పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డి వర్గీయులు హల్చల్ చేశారు. చేరికలను నిరసిస్తూ తాడిపర్తి గ్రామానికి చెందిన చిన్నారెడ్డి వర్గీయుడు, మాజీ సర్పంచ్ గణేష్ గౌడ్ అనుచరుల ఎమ్మెల్యే మేఘారెడ్డి(MLA Meghareddy) ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు.
ఏకంగా గణేష్ గౌడ్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకోవడమే కాకుండా ఎమ్మెల్యే మేఘారెడ్డిపై పెట్రోల్‌తో దాడికి ప్రయత్నించి నానా హంగామా సృష్టించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టారు. చిన్నారెడ్డి ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని మేఘారెడ్డి వర్గీయులు హెచ్చరించారు.