స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు షురూ

- నేటినుంచి పాస్‌పోర్ట్ సేవలు కూడా
- బ్యాంకుల పని వేళలల్లోనూ మార్పు
ప్రత్యేక ప్రతినిధి, మే 31 (నమస్తే తెలంగాణ): లాక్డౌన్ మినహాయింపు సమయం పెంచిన నేపథ్యంలో ఒక్కో ప్రభుత్వ సేవ అందుబాటులోకి వస్తున్నది. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. మంగళవారం నుంచి పాస్‌పోర్ట్ సేవలు మొదలు కానున్నాయి. బ్యాంకుల పనివేళలూ పెరుగనున్నాయి. భూముల రిజిస్ట్రేషన్లు సోమవారం ఒక్కరోజే దాదాపు 2 వేలు జరిగాయి. లాక్డౌన్ దృష్ట్యా వ్యవసాయేతర రిజిస్ట్రేషపూర్తిగా అడ్వాన్స్ స్లాట్ బుకింగ్ ద్వారా చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిప్రకారం ప్రతి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రోజుకు 24 చొప్పున చేస్తున్నారు. ఇద్దరు సబ్రిజిస్ట్రార్లు ఉన్న జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రోజుకు 48 వరకు అనుమతినిస్తున్నారు. స్లాట్ బుక్కు www.telangana. regisration.inలో లాగిన్ కావాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ కమిషనర్ శేషాద్రి సూచించారు.
పాస్‌పోర్టు సేవలు పునరుద్ధరణ.. 2 గంటలదాకా బ్యాంకులు
రీజినల్ పాస్‌పోర్ట్ సేవాకేంద్రాలు, పాస్‌పోర్ట్ లఘుకేంద్రాలు మంగళవారం నుంచి తమ సేవలను పునరుద్ధరించనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పనిచేస్తాయని హైదరాబాద్ రీజనల్ పాస్‌పోర్ట్ ఆఫీసర్ దాసరి బాలయ్య తెలిపారు. రాష్ట్రంలోని బ్యాంకుల పనివేళల్లో మార్పులు చేశారు. మంగళవారం నుంచి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకు లు తెరిచి ఉంటాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

