TS Assembly Elections | హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడతాయని, పార్లమెంట్ ఎన్నికలతో కలిపి జరుగుతాయంటూ కొన్నాళ్లుగా ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలకు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వమే కౌంటర్ ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, సిద్ధంగా ఉండాలని స్పష్టంచేసింది. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్రస్థాయి పదాధికారుల సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి మాట్లాడుతూ..
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని చెప్పారు. ఇతర ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి ప్రకాశ్ జవదేకర్ సైతం ఇదే విషయాన్ని చెప్పారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయని కొందరు అనుకుంటున్నారని, అలాంటి భ్రమలు పెట్టుకోవద్దని హెచ్చరించారు. కచ్చితంగా షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని వెల్లడించారు.