గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 08, 2020 , 15:31:09

ఫుట్ పాత్ పై పసికందు..

ఫుట్ పాత్ పై పసికందు..

వికారాబాద్ జిల్లా: వికారాబాద్ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ముక్కుపచ్చలారని పసికందును ఫుట్ పాత్ పై వదిలేసి వెళ్లారు. పసికందును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు చిన్నారిని సురక్షితంగా కాపాడి..మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. logo