TTD | నేటి నుంచి తిరుమల శ్రీవారి దర్శన, ఆర్జిత సేవా టికెట్లు
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ దర్శనానికి ఏప్రిల్ నెల దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల కోటా షెడ్యూల్‌ను టీటీడీ బుధవారం వెల్లడించింది. ఈ నెల 18 నుంచి 27 వరకు భక్తులు ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల ఆన్లైన్ లక్కీడిప్ కోసం ఈ నెల 18న ఉదయం 10 గంటల నుంచి 20న ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు.
TTD | హైదరాబాద్, జనవరి 17(నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ దర్శనానికి ఏప్రిల్ నెల దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల కోటా షెడ్యూల్‌ను టీటీడీ బుధవారం వెల్లడించింది. ఈ నెల 18 నుంచి 27 వరకు భక్తులు ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల ఆన్లైన్ లక్కీడిప్ కోసం ఈ నెల 18న ఉదయం 10 గంటల నుంచి 20న ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు.
లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు 22న మధ్యాహ్నం 12 గంటలలోపు నిర్ణీత రుసుం చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్లు 22న ఉదయం 10 గంటలకు, వర్చువల్ సేవా టికెట్లు 22న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. ఏప్రిల్ 21 నుంచి 23 వరకు జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ సేవా టికెట్లను ఇదేనెల 22న ఉదయం 10 గంటలకు, అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

