హైదరాబాద్, ఫిబ్రవరి 4(నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం పంపిణీ చేయనున్న ఉచిత ఉపకరణాల కోసం ఈ నెల 10లోగా దరఖాస్తు చేసుకోవాలని దివ్యాంగుల కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ మత్తినేని వీరయ్య బుధవారం ఒక ప్రకటన తెలిపారు.
గతంలో దరఖాస్తు చేసుకొని అవకాశం రాని వారు సైతం తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తుల్లో ఏమైనా సమస్యలు ఎదురైతే చైర్మన్ కార్యాలయ ఇన్చార్జి రజిని సెల్ నంబర్ 9959583502లో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సంప్రదించాలని కోరారు.
