Spirit | ‘స్పిరిట్’లో స్పెషల్ సాంగ్ సందడి.. తృప్తి దిమ్రితో పాటు మరో బాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ?
Spirit | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘స్పిరిట్’ ఒకటి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్‌ను ఓ పవర్ఫుల్ పోలీస్ అధికారిగా చూపించబోతున్న ఈ సినిమా గురించి రోజుకొక కొత్త వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Spirit | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘స్పిరిట్’ ఒకటి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్‌ను ఓ పవర్ఫుల్ పోలీస్ అధికారిగా చూపించబోతున్న ఈ సినిమా గురించి రోజుకొక కొత్త వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్డేట్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. త్వరలో ప్రారంభం కానున్న తదుపరి షెడ్యూల్లో చిత్రబృందం ఓ ప్రత్యేక పాటను చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఈ పాట సినిమాకే హైలైట్‌గా నిలిచేలా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
ఈ ప్రత్యేక గీతంలో హీరోయిన్ తృప్తి దిమ్రితో పాటు మరో బాలీవుడ్ నటి కూడా కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఆ హీరోయిన్ ఎవరు అనే విషయంలో ఇప్పటివరకు అధికారిక సమాచారం వెలువడలేదు. దీంతో ఆ బాలీవుడ్ బ్యూటీ ఎవరు అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ప్రస్తుతం ఈ పాట కోసం చిత్రబృందం భారీ సెట్‌ను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగా తన సినిమాల్లో పాటలను కూడా కథలో భాగంగా, ప్రత్యేకంగా చూపించే ప్రయత్నం చేస్తుంటారు. దీంతో ‘స్పిరిట్’లో ఈ స్పెషల్ సాంగ్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి మరింత పెరిగింది.
ఇక సినిమా విషయానికి వస్తే, ‘స్పిరిట్’ పూర్తిస్థాయి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో భారీ బజ్‌ను సృష్టించింది. పోస్టర్లో ప్రభాస్ వైల్డ్ అండ్ మాస్ లుక్‌లో కనిపించడం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.ఈ చిత్రంలో ప్రభాస్ పాత్ర ఇప్పటివరకు ఆయన చేసిన పాత్రలకు భిన్నంగా ఉండబోతుందని తెలుస్తోంది. ఓ నిజాయితీ గల, పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఆయన కనిపించనున్నట్లు సమాచారం. యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగాలు, మాస్ ఎలిమెంట్స్ సమపాళ్లలో ఉండేలా దర్శకుడు కథను సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తోంది.సినిమా సంగీత బాధ్యతలను హర్షవర్ధన్ రామేశ్వర్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, సంగీత దర్శకుడితో కలిసి పలు మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తి చేసినట్లు సమాచారం. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
90 Hours Fasting | 90 గంటల పాటు నిరంతరాయంగా ఉపవాసం ఉండడం సాధ్యమేనా.. డాక్టర్లు ఏమంటున్నారు..?
Parliament: డీలిమిటేషన్, వుమెన్స్ కోటా బిల్లులు.. ఈనెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

