హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): విదేశాల్లో వివిధ ఉద్యోగాలకు రాష్ట్ర యువత నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) సీఈవో విష్ణువర్ధన్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. యూఏఈ, ఆస్ట్రేలియా దేశాల్లో మంచి అవకాశాలున్నాయని చెప్పారు. ఆస్ట్రేలియాలో హెచ్డీ మెయింటెనెన్స్ టెక్నీషియన్, ఫిట్టర్, సీఎన్సీ, మెషినిస్ట్, చెఫ్, యూఏఈలో బ్లాస్టర్ పెయింటర్, క్లీనర్, ఫోర్‌మ్యాన్, బ్లాస్టింగ్, పెయింటింగ్, ఫోర్‌మ్యాన్ ప్లేటర్, జీటీఏడబ్ల్యూ వెల్డర్, ఐటీవీ డ్రైవర్, మెషినిస్ట్, పైప్ ఫిట్టర్, ప్లేటర్ ఫ్యాబ్రికేటర్, స్కాఫోల్డర్, సెక్యూరిటీ సిస్టమ్స్ టెక్నీషియన్, సీనియర్ ఆఫీసర్ (ఆపరేషన్స్), ఒరాకిల్ లీటెక్నాల్ ఫ్యాక్షన్, అకౌంట్స్ ఆఫీసర్, అకౌంట్స్ మేనేజర్ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు బయోడాటాను hrm-tomcom-letf@telangana.gov.inకు మెయిల్ చేయాలని తెలిపారు. వివరాలకు 99519 09863, 83286 02231ను సంప్రదించాలని విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు.