సీఎం కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారు : ఏపీ మంత్రి విశ్వరూప్
Minister Pinipe Viswarup | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారిని ఏపీ రవాణాశాఖ మంత్రి విశ్వరూప్ సోమవారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రికి ఆలయ సంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వయంభు నరసింహస్వామి వారిని
హైదరాబాద్ : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారిని ఏపీ రవాణాశాఖ మంత్రి విశ్వరూప్ సోమవారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రికి ఆలయ సంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వయంభు నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వేద ఆశీర్వచనం చేసి.. అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రపంచమే అబ్బురపడే విధంగా యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతంగా పునర్మించారన్నారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. తనకు ఆరోగ్యం క్షీణించడంతో స్వామివారికి మొక్క ముంబయికి వెళ్లి శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్యం కుదుటపడడంతో స్వామివారిని దర్శించుకునేందుకు గుట్టకు వచ్చినట్లు చెప్పారు. యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. మరో మూడు నెలల్లో స్వామి వారిని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా రానున్నట్లు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

