నీళ్ల దోపిడీకి ఏపీ సర్కారు కుట్ర!
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఆదేశాలను ఏపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతున్నది. బ్రిజేశ్‌కుమార్ తీర్పును అనుసరిస్తూ తుంగభద్ర నదిపై నిజాం కాలంలో కర్ణాటకలో నిర్మించిన ఆర్డీఎస్ ఆనకట్ట (రాజోళీ బండ డైవర్షన్ స్కీం) నుంచి అక్రమంగా కాల్వను ఏర్పాటు చేసుకొని నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం గతేడాది జూన్‌లో చర్యలు చేపట్టింది. కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ, కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాల అనుమతులు లేకుండా ఆర్డీఎస్ కుడి వైపు పనులను
కేఆర్ఎంబీ ఆదేశాలు బేఖాతర్
ఆర్డీఎస్ కుడి కాల్వ స్ట్రక్చర్ పూర్తి
గేట్లు అమర్చేందుకు కసరత్తు
4 టీఎంసీలు తరలించే పన్నాగం
తెలంగాణకు ఏర్పడనున్న నీటి కటకట
అయిజ, జూలై 8: కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఆదేశాలను ఏపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతున్నది. బ్రిజేశ్‌కుమార్ తీర్పును అనుసరిస్తూ తుంగభద్ర నదిపై నిజాం కాలంలో కర్ణాటకలో నిర్మించిన ఆర్డీఎస్ ఆనకట్ట (రాజోళీ బండ డైవర్షన్ స్కీం) నుంచి అక్రమంగా కాల్వను ఏర్పాటు చేసుకొని నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం గతేడాది జూన్‌లో చర్యలు చేపట్టింది. కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ, కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాల అనుమతులు లేకుండా ఆర్డీఎస్ కుడి వైపు పనులను వేగంగా పూర్తి చేసింది. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ కృష్ణానది నుంచి ఏపీకి 4 టీఎంసీల నీటి కేటాయింపులు జరిపింది. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు అస్తవ్యస్తంగా చేపట్టిందని ఈ తీర్పును నిలిపివేయాలని తెలంగాణ జలవనరుల శాఖ అధికారులు గతంలోనే కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశారు. అదీగాక ఆర్డీఎస్ కుడివైపు కెనాల్ పనులు చేపట్టకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీంతో కొంతకాలం పనులు నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా స్ట్రక్చర్ నిర్మాణం పనులు పూర్తి చేసి గేట్లు అమర్చేందుకు కసరత్తు చేస్తున్నది.

గేట్లు అమర్చేందుకు సిద్ధంగా ఉంచిన మెటీరియల్
రూ.1,985.423 కోట్లతో పనులు
ఏపీ ప్రభుత్వం రూ.1,985.423 కోట్ల వ్యయంతో కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్ట కుడి కాల్వ పనులకు గత ఏడాది శ్రీకారం చుట్టింది. 4 టీఎంసీల నీటిని తరలించేందుకు కాల్వను తవ్వి గ్రావిటీ ద్వారా 40 వేల ఎకరాల ఆయకట్టుతోపాటు 4 లిఫ్టులను ఏర్పాటు చేసి మరో 5 లక్షల ఎకరాల ఆయకట్టుకు అక్రమంగా నీటిని తరలించే కుట్రలు చేస్తున్నది. కర్నూల్ జిల్లాలోని రైతులకు సాగు, తాగునీటిని పుష్కలంగా అందించాలనే లక్ష్యంతో ఏపీ సర్కార్ కుడివైపు కాల్వ పనులు చేపట్టింది. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును అడ్డం పెట్టుకొని తుంగభద్ర నది నుంచి నీటిని అక్రమంగా తరలించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకొన్నది. కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తే కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ, కేంద్ర ప్రభుత్వంతోపాటు నదినీటి హక్కులు కలిగిన రాష్ర్టాల అనుమతులు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ కుడివైపు కాల్వ నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా చేపట్టగా పనులు తుది దశకు చేరుకొన్నాయి.
అలంపూర్ ఆయకట్టుకు నీటి కటకట..
ఏపీ ప్రభుత్వం ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద కుడివైపు చేపట్టిన కాల్వ నిర్మాణంతో తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ నియోజక వర్గంలోని ఆర్డీఎస్ ఆయకట్టుకు సాగునీటికి కటకట ఏర్పడనున్నది. ఆర్డీఎస్ ఆనకట్ట నుంచి గ్రావిటీ ద్వారా ఏపీ ప్రభుత్వం సునాయసంగా నీటిని తరలించేందుకు అవకాశం మెండుగా ఉండటంతో ఎడమ కాల్వ (తెలంగాణ ఆయకట్టు)కు నీటి రాక తగ్గుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 87,500 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా ఏనాడు 35 వేల ఎకరాలకు సాగునీరు అందిన దాఖలాలు లేవని రైతులు పేర్కొంటున్నారు. ఆర్డీఎస్ ఆయకట్టుకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం నిరుపయోగంగా మారే అవకాశాలు ఉన్నాయని రైతులు వాపోతున్నారు. ఆర్డీఎస్ కుడివైపు కాల్వ నిర్మాణంతో తుంగభద్ర నది పరీవాహక ప్రాంతంలో వంద గ్రామాలు తాగునీటికి, ఆర్డీఎస్ ఆయకట్టు 87,500 ఎకరాలు, నదితీర ప్రాంత ఆయకట్టు దాదాపు 4 లక్షల ఎకరాలు బీడుగా మారే ప్రమాదం ఉన్నదని రైతులు పేర్కొంటున్నారు.
అక్రమ కాల్వ పనులు నిలిపివేయాలి
ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఆర్డీఎస్ కుడి కాల్వ పనులను వెంటనే నిలిపివేయాలి. ఈ కాల్వ కారణంగా తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాలతోపాటు ఏపీలోని కర్నూల్ జిల్లాలు తాగు, సాగునీటికి ఇబ్బందులు కలుగుతాయి. తెలంగాణ రైతుల పక్షాన అలంపూర్, గద్వాల ఎమ్మెల్యేలు అబ్రహం, కృష్ణమోహన్‌రెడ్డి సహకారంతో ఉమ్మడి జిల్లా మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ దృష్టికి తీసుకెళ్తాం. మంత్రుల ద్వారా సీఎం కేసీఆర్‌తో చర్చించి ఏపీ అక్రమ నీటి తరలింపును అడ్డుకొని తీరుతాం. అవసరమైతే తెలంగాణ ప్రభుత్వ అనుమతితో సీడబ్ల్యూసీకి ఫిర్యాదు చేస్తాం. రైతుల ప్రయోజనాల దృష్ట్యా సుప్రీంకోర్టుకు వెళ్తా
– తనగల సీతారాంరెడ్డి, ఆర్డీఎస్ ప్రాజెక్టు, మాజీ చైర్మన్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- ap govt
- Conspiracy
- krmb
- looting
RELATED ARTICLES
తాజా వార్తలు
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

