బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్
CM KCR | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను నియమిస్తూ సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. రావెల కిశోర్ జాతీయ స్థాయిలో పని చేయాల్సిన వ్యక్తి అని తెలిపారు. పార్థసారథి సేవలు కూడా ఉపయోగించుకుంటాం. ఇవాళ మాకు మంచి
హైదరాబాద్ : బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను నియమిస్తూ సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. రావెల కిశోర్ జాతీయ స్థాయిలో పని చేయాల్సిన వ్యక్తి అని తెలిపారు. పార్థసారథి సేవలు కూడా ఉపయోగించుకుంటాం. ఇవాళ మాకు మంచి వజ్రాలు దొరికాయని భావిస్తున్నాను. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంచి పనిని చేసుకుంటున్నాం అని కేసీఆర్ తెలిపారు. ఏపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ తెలిపారు.
వీరి చేరికల సందర్భంగా సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్లో ప్రసంగించారు. తోట చంద్రశేఖర్ వారి కర్తవ్య నిర్వహణలో పూర్తిగా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. వారు విజయం సాధిస్తారు అని సీఎం కేసీఆర్ తెలిపారు.
సంక్రాంతి మరునాడు నుంచి తట్టుకోలేనంత ఒత్తిడి వస్తుంది. వండర్‌ఫుల్‌గా మనం పురోగమించే అవకాశం ఉంది. ఆశ్చర్యపరిచే చేరికలు త్వరలోనే ఉంటాయి. నిన్న చాలాసేపు మాట్లాడం. ఒక పంథా వేసుకున్నాం. ఆ దిశగా పురోగమించేందుకు జాతీయస్థాయిలో కిశోర్ పని చేస్తారు. చాలా గొప్పవారు కూడా ఫోన్లు చేశారు. ఏపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఫోన్లు చేస్తున్నారు. మీరు సిట్టింగ్ కదా అని అడిగితే మేం ఫిట్టింగ్ లేమని చెబుతున్నారు. ఏపీలో పార్టీ బరువు, బాధ్యత చంద్రశేఖర్‌పై ఉంటుంది. వారికి పరిపాలన అనుభవం ఉంది. అవకాశం కలిగింది.. ఇక తడాఖా చూపించడమే తరువాయి అని కేసీఆర్ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

