Telangana History | తెలంగాణ చరిత్ర, సంస్కృతిపై కోర్సు.. ఇంగ్లిష్ మీడియంలో బోధించే టీచర్ల కోసం మరో కోర్సు
తెలంగాణ చరిత్ర-సంస్కృతి.. రాష్ట్రంలో ఏ ఉద్యోగం పొందాలన్నా ఈ సబ్జెక్టుపై సమగ్రమైన పట్టు సాధించాల్సిందే. గ్రూప్స్ ఉద్యోగాలు మొదలుకొని జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల వరకు అభ్యర్థులు ఈ సబ్జెక్టుతో కుస్తీ పట్టాల్సిందే.
- వచ్చే విద్యాసంవత్సరమే బీఆర్ఏఓ యూలో అందుబాటులోకి
Telangana History | హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ చరిత్ర-సంస్కృతి.. రాష్ట్రంలో ఏ ఉద్యోగం పొందాలన్నా ఈ సబ్జెక్టుపై సమగ్రమైన పట్టు సాధించాల్సిందే. గ్రూప్స్ ఉద్యోగాలు మొదలుకొని జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల వరకు అభ్యర్థులు ఈ సబ్జెక్టుతో కుస్తీ పట్టాల్సిందే. దీంట్లో గరిష్ఠ మార్కులు పొందితేనే ఉద్యోగం సొంతమవుతుంది. ఇలాంటి ప్రత్యేకతలు గల ఈ సబ్జెక్టును ప్రత్యేక కోర్సుగా ప్రవేశపెట్టాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (బీఆర్ఏఓయూ) నిర్ణయించింది. తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ పేరుతో ప్రత్యేకంగా పీజీ డిప్లొమా కోర్సును అందుబాటులోకి తీసుకురానున్నది.
ఇంగ్లిష్ మీడియంలో బోధించే టీచర్ల కోసం ప్రత్యేకంగా ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్‌లోనూ పీజీ డిప్లొమా కోర్సును ఈ వర్సిటీ అందుబాటులోకి తీసుకురానున్నది. రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో గత విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం 1 -9 తరగతుల వరకు ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన చేస్తున్నారు. అయితే టీచర్లంతా తెలుగు మీడియం వారే కావడంతో బోధనలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. విద్యార్థులు ఇంగ్లిష్‌పై అంత పట్టు సాధించలేకపోతున్నారు. ప్రైవేట్ స్కూళ్లల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రత్యేక పీజీ డిప్లొమా కోర్సును బీఆర్ఏఓయూ రూపకల్పన చేసింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ రెండు సహా మొత్తం 11 కొత్త కోర్సులు అందుబాటులోకి వస్తాయని వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కుసుంబ సీతారామారావు తెలిపారు. వర్సిటీలో ప్రస్తుతం 40 రకాల కోర్సులను నిర్వహిస్తున్నారు. ఎంబీఏ, ఎంబీఏ హెల్త్ కేర్ మేనేజ్మెంట్, బీఎల్ఐఎస్సీ, బీఎడ్, బీఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్) వంటి కోర్సులను నిర్వహిస్తుండగా, విద్యార్థుల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నది.
కొత్త కోర్సులు ఇవే..
- ఎంఏ ఇంటర్నేషనల్ రిలేషన్స్
- ఎంఏ అర్బన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్
- పీజీ డిప్లొమా ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్
- పీజీ డిప్లొమా ఇన్ రూరల్ లైవ్లీహుడ్ అండ్ సస్టెనబుల్ డెవలప్మెంట్
- పీజీ డిప్లొమా ఇన్ జనరల్ లీగల్ అవేర్నెస్
- పీజీ డిప్లొమా ఇన్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్
- పీజీ డిప్లొమా ఇన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్ (ప్రైమరీ అండ్ సెకండరీ స్కూల్ టీచర్స్, ఎర్లీ చైల్డ్‌హుడ్ అండ్ ఎడ్యుకేషన్)
- పీజీ డిప్లొమా ఇన్ ప్రీ ప్రైమరీ టీచర్ ఎడ్యుకేషన్
- పీజీ డిప్లొమా ఇన్ డిజిటల్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్
- పీజీ డిప్లొమా ఇన్ ఇ-గవర్నెన్స్
- యాంకరింగ్ డబ్బింగ్ అండ్ వాయిస్ ఓవర్ సర్టిఫికెట్ కోర్సు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

