హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): స్కై సొల్యూషన్స్ సీఈవో అనిల్ బోయినపల్లి గ్లోబీ అవార్డ్స్-2025 గోల్డ్ గ్లోబీ థాట్ లీడర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు. ప్రపంచస్థాయిలో అత్యత్తుమ విజనరీ నాయకులను ఈ అవార్డుకు ఎంపిక చేస్తారని ఇన్నోవేటర్లు భావిస్తుంటారు. ‘గ్లోబీ అవార్డ్స్ 100శాతం మెరిట్ ఆధారితమైనవి. విజేతలను ప్రపంచ పరిశ్రమ నిపుణులు, స్వతంత్ర మూల్యాంకనాల ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.
గోల్డ్ గ్లోబీ గౌరవాన్ని పొందేందుకు 8.5 నుంచి 10వరకు అసాధారణ సగటు సోరు అవసరం. ఇది అత్యుత్తమ, ఇన్నోవేషన్, లక్ష్యాన్ని సాధించిన నాయకత్వ స్థాయికి ఈ అవార్డు ప్రతీక’ అని స్కై సొల్యూషన్స్ పేర్కొన్నది. సై సొల్యూషన్స్‌లో లక్ష్యాన్ని, సమగ్రత, సాధికారత ద్వారా ఫెడరల్ ఇన్నోవేషన్‌ను ముందుకు తీసుకెళ్లినందుకు అనిల్ ఈ గౌరవాన్ని అందుకున్నారని తెలిపింది.