వైసీపీ నేతల వ్యాఖ్యలు విడ్డూరం
ఏపీ టీచర్లపై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్న మా టల్లో తప్పేముందని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ప్రశ్నించారు.
- ఏపీ నాయకులపై ఎమ్మెల్యే క్రాంతి ఆగ్రహం
హరీశ్‌రావు మాటల్లో తప్పేముందని ప్రశ్న
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఏపీ టీచర్లపై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్న మా టల్లో తప్పేముందని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ప్రశ్నించారు. హరీశ్‌రావుపై వైఎస్సార్సీపీ జనరల్ సెక్రెటరీ సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ మంత్రి అమర్నాథ్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మంత్రి హరీశ్‌రావు మాట్లాడిన సందర్భం వేరు అయినప్పటికీ ఇష్టమొచ్చిన రీతిలో ఏపీ మంత్రులు మాట్లాడటం విడ్డూరంగా ఉన్నాయని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం 73 శాతం ఫిట్మెంట్ ఇస్తే, పక్క రాష్ట్రంలో 66 శాతం మించి ఇవ్వలేదని.. కేంద్రం విధించిన షరతులకు తలొగ్గి వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టి రూ.7వేల కోట్లు తీసుకున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఇతర రాష్ర్టాల వారిపైగాని, ప్రభుత్వ ఉద్యోగులపై గాని మంత్రి హరీశ్‌రావు ఏనాడు తప్పుడు వ్యాఖ్యలు చేయలేదన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుంటే ఏపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రచారం కోసం ఏపీ నాయకులు తెలంగాణపై గాని, టీఆర్ఎస్ నాయకులపై గాని అనవసరపు వ్యాఖ్యలు చేయవద్దని హితవు పలికారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

