బాలికను చిదిమేసిన ఆర్టీసీ బస్సు
హైదరాబాద్ నగరంలో ఓ ఆర్టీసీ బస్సు ఓ బాలిక నిండు జీవితాన్ని చిదిమేసింది. యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని మెహరీన్ (16) మృతిచెందింది.
- విద్యార్థిని పైనుంచి వెళ్లిన టైర్లు
- అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన బాలిక
వెంగళరావునగర్,జూన్ 14: హైదరాబాద్ నగరంలో ఓ ఆర్టీసీ బస్సు ఓ బాలిక నిండు జీవితాన్ని చిదిమేసింది. యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని మెహరీన్ (16) మృతిచెందింది. బోరబండ సఫ్దర్‌నగర్‌కు చెందిన ఈమె తన అ క్క జువేరియాతో కలిసి యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ వద్ద ఉన్న మాస్టర్స్ జూనియర్ కాలేజీలో చదువు తున్నది. ఇద్దరూ కలిసి శుక్రవారం కాలేజీ నుంచి ఇంటికి వెళ్లేందుకు సమీపంలోని బస్టాప్ వద్దకు వెళ్లారు.
అంతలో కేపీహెచ్‌బీ డిపోనకు చెందిన సి కింద్రాబాద్ నుంచి బోరబండ వెళ్లే 10వై రూట్ నంబర్ బస్సు వచ్చి ఆగింది. మెహరీన్ బస్సెక్కగా, జువేరియా ఎక్కలేదు. బ స్సు ఆపాలని డ్రైవర్‌ను కోరినా వినిపించుకోకపోవడంతో మెహరీన్ బస్సు కిందికి దూకేయడంతో కిందపడింది. వెంట నే ఆమెపై నుంచి బస్సు ముందు, వెనుక టైర్లు వెళ్లడంతో వెంటనే అక్కడికక్కడే ప్రాణాలొదిలింది. చెల్లిని చూసి అక్క జువేరియా, తోటి స్నేహితులు గుండెలవిసేలా రోదించారు. డ్రైవర్ నిర్లక్ష్యమే తన చెల్లి ప్రాణాలు తీసిందని జువేరియా ఆరోపించింది. మధురానగర్ ఇన్స్పెక్టర్ మధుసూదన్‌రెడ్డి ప్రమాద స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలో పలుచోట్ల టీడీపీ, వైసీపీ వర్గీయుల బాహాబాహీ..!
‘ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు అధిక ఆదాయం’
Pushkar Singh Dhami | ఉత్తరాఖండ్‌లో మద్రాసాలలో శుక్రవారం సెలవు రద్దు.. ఇకపై ఆదివారమే సెలవు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
KTR | కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

