‘సల్లంగుండు కొడుకా’..
అని సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి ఓ వృద్ధురాలు దండం పెట్టి దీవించింది. ఈ దృశ్యం సోమవారం జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కటాపూర్‌లో కనిపించింది. ఇట్నేని లచ్చవ్వ(80) కొద్దికాలంగా కంటిచూపు సమస్యతో బాధపడుతున్నది. గ్రామంలో కంటివెలుగు శిబిరం ప్రారంభించిన విషయాన్ని సర్పంచ్ రాజమౌళి ద్వారా తెలుసుకొని ఉచితంగా పరీక్షలు చేయించుకున్నది.
ఆమెకు పాయింట్ ఎకవగా ఉండడంతో వైద్యసిబ్బంది కండ్లద్దాలకు ఆర్డర్ పెట్టారు. కంటి సమస్య తీవ్రంగా ఉండటంతో ఆపరేషన్‌కు సిఫారసు చేశారు. పరీక్షలు చేయించుకొని బయటకొస్తూ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీని చూస్తూ.. తనలాంటి ఎందరికో ఆసరా పింఛన్లిస్తున్నాడని, మరెందరికో కంటి చూపు ప్రసాదిస్తున్నాడని లచ్చవ్వ మనసారా ఆశీర్వదించింది. -రాయికల్