బర్రెల పంపిణీలో చేతివాటం
వర్షాభావ పరిస్థితులు, గ్రామీణ ప్రాంతాల్లో బడుగు, బలహీనవర్గాలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉద్దేశించిన పాడి పశువుల పంపిణీ పథకం పక్కదారి పడుతున్నది.
- తక్కువ ధరవి అంటగంటి అధికారులు, మధ్యవర్తుల మాయాజాలం
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తేతెలంగాణ): వర్షాభావ పరిస్థితులు, గ్రామీణ ప్రాంతాల్లో బడుగు, బలహీనవర్గాలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉద్దేశించిన పాడి పశువుల పంపిణీ పథకం పక్కదారి పడుతున్నది. అధికారులు, మధ్య దళారులు చేతివాటం ప్రదర్శించినట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. దళిత సామాజిక వర్గాల్లో ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. రాష్ట్రంలోని వరంగల్, సిద్దిపేట, గద్వాల జిల్లాలను పైలట్ ప్రాజెక్టు కింద ప్రభుత్వం ఎంపిక చేసింది.
ఐటీడీఏ, షెడ్యూల్డ్ కులాల సంస్థలు, సెర్ప్ తదితర సంస్థల ద్వారా పాడి పశువుల పంపిణీని నిరుడు ఆరంభించింది. ఆ మూడు జిల్లాల్లో గడిచిన ఏడాది కాలంగా 2,000 పాడి పశువులు పంపిణీ చేసినట్టు రికార్డుల్లో నమోదైంది. కానీ, అధికారులు, మధ్యదళారులు అవకతవకలకు పాల్పడినట్టు అబ్ధిదారుల నుంచి పశుసంవర్ధక శాఖకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. దీనిపై సమగ్ర విచారణ జరుపాలని వారు కోరుతున్నారు.
బక్క బర్రెలను అంటగట్టారు
దళిత కుటుంబాల జీవనోపాధి కోసం అమలు చేస్తున్న ఈ పథకం అధికారులకు, దళారులకు వరంగా మారిందనే ఫిర్యాదులు వచ్చాయి. పథకం కింద రెండు పాడి బర్రెలకు ప్రభుత్వం రూ.1.60 లక్షల సబ్సిడీని అందిస్తున్నది. అంటే ఒక్కో బర్రెకు రూ.80 వేల చొప్పున ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. ప్రతి రైతూ అదనంగా సుమారు రూ.40వేల వరకు సొంతంగా చెల్లించాల్సి ఉంటుంది. మార్కెట్లో మంచి పాడి (3 లీటర్లకు పైగా పాలిచ్చే) బర్రె వాస్తవ ధర రూ.1.20 లక్షలు పలుకుతుంది.
అప్పుడు లబ్ధిదారులు తమకు నచ్చిన బర్రెను కొనుగోలు చేసుకోవచ్చు. కానీ, ఆ మూడు జిల్లాల్లోని అధికారులు రూ. 40వేలు, రూ.45 వేల విలువైన బక్క బర్రెలనే కొని లబ్ధిదారులకు అంటగడుతున్నారని ఆరో పణలున్నాయి. మిగతా సొమ్మును తమ ఖాతాలో వేసుకుంటున్నారని లబ్ధిదారులే ఆరోపిస్తున్నారు. ఈ దందా వెనుక రాష్ట్ర కార్యాలయానికి చెందిన ఓ పశువైద్యాధికారి ఉన్నారనే ఫిర్యాదులు ఉన్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

