ప్రాజెక్టులకు జలకళ
మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరిలో వరద ప్రవాహం కొనసాగుతున్నది. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగవకు 90 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టులకు వరద కొనసాగుతూనే ఉన్నది
ఎస్సారెస్పీలో 76 టీఎంసీల నిల్వ
మత్తళ్లు పోస్తున్న 8 వేల చెరువులు
హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరిలో వరద ప్రవాహం కొనసాగుతున్నది. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగవకు 90 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టులకు వరద కొనసాగుతూనే ఉన్నది. సింగూరు ప్రాజెక్టు జలకళను సం తరించుకుంది. లక్ష్మి, పార్వతి, సరస్వతి బరాజ్‌లకు సైతం వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో తుం గభద్ర, కృష్ణానదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. ఆల్మట్టికి ఆదివారం 75 వేల క్యూసెక్కుల వరద రాగా, సోమవారం సాయం త్రం నాటికి 82 వేల క్యూసెక్కులకు పెరిగింది.
మత్తళ్లు దుంకుతున్న 8 వేల చెరువులు
రాష్ట్రవ్యాప్తంగా 8,107 చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. 8,641 చెరువులు పూర్తిస్థాయి నీటి నిల్వమట్టానికి చేరుకున్నాయి. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మం చిర్యాల, పెద్దపల్లి జిల్లాలో చెరువులన్నీ నిండిపోయాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని లక్ష్మీబరాజ్ (మేడిగడ్డ) 81 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. మూసీ ప్రాజెక్టు ఐదు గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

