బాబు కేసులన్నీ 4 వరకు వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు బుధవారం ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఎక్కడా ఊరట లభించలేదు. కేసును రద్దు చేయాలంటూ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు ధర్మాసనం తొలుత విముఖత వ్యక్తం చేసింది.
- క్వాష్ పిటిషన్ విచారణకు సుప్రీం నో
- బెయిల్, కస్టడీ పిటిషన్లను వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు బుధవారం ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఎక్కడా ఊరట లభించలేదు. కేసును రద్దు చేయాలంటూ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు ధర్మాసనం తొలుత విముఖత వ్యక్తం చేసింది. కేసు విచారణకు రాగానే ‘నాట్ బిఫోర్ మీ’ అంటూ జస్టిస్ భట్టి నిరాసక్తత వ్యక్తం చేశారు. దీంతో మరో న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా జోక్యం చేసుకొని తన సహచరుడు భట్టి సుముఖంగా లేనందున కేసును మరో బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్టు వెల్లడించారు. చంద్రబాబు తరఫు న్యాయవాదులు కేసును చీఫ్ జస్టిస్ బెంచ్ వద్ద నివేదించారు. కాగా, ఈ సమయంలో క్వాష్ పిటిషన్‌ను అనుమతించవద్దని సీఐడీ తరఫు న్యాయవాదులు కోరారు.
ఈ కేసులో లోతైన విచారణ జరగాల్సి ఉందని అన్నారు. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ.. ఏసీబీ కోర్టు విచారణ, పోలీసు కస్టడీ విచారణను తాము అడ్డుకోలేమని చెప్పారు. ఈ పిటిషన్‌పై అక్టోబర్ 3న ఏదో ఒక బెంచ్ విచారణ జరుపుతుందని స్పష్టం చేశారు. ఇక ఇదే కేసులో బెయిల్ కోసం చంద్రబాబు పెట్టుకున్న పిటిషన్‌పై విచారణను విజయవాడ ఏసీబీ కోర్టు అక్టోబర్ 4కు వాయిదా వేసింది. చంద్రబాబును మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా అదేరోజుకు వాయిదా వేసింది. రెండు పిటిషన్లపై ఒకేసారి వాదనలు వింటామని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చెప్పారు. అమరావతి రింగ్‌రోడ్డు, ఫైబర్‌నెట్ కేసుల్లో పీటీ వారెంట్లపై విచారణను కూడా ఏసీబీ కోర్టు అక్టోబర్ 4కు వాయిదా వేసింది.
హైకోర్టులో లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్
అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్ కేసులో నిందితునిగా ఉన్న టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్‌కు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఏ1గా చంద్రాబాబు ఉండగా, ఏ14గా లోకేశ్ ఉన్నారు. చంద్రబాబు అరెస్టయిన నాటి నుంచి ఢిల్లీలోనే మకాం వేసిన లోకేశ్ ఈ నెల 29 నుంచి యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ లోగా సీఐడీ అరెస్టు చేసే అవకాశం ఉండటంతో ఆయన ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

