జపాన్ పర్యటనకు అల్ఫోర్స్ విద్యార్థిని
జాతీయస్థాయి ఇన్స్పైర్ అవార్డ్స్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ అల్ఫోర్స్ పాఠశాలకు చెందిన ఎం పూజశ్రీ జపాన్‌లో జరిగే అంతర్జాతీయ ప్రదర్శనకు ఎంపికైంది.
- జాతీయస్థాయి ఇన్స్పైర్ అవార్డ్స్‌లో అద్భుత ప్రదర్శన
సుల్తానాబాద్, మే 16: జాతీయస్థాయి ఇన్స్పైర్ అవార్డ్స్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ అల్ఫోర్స్ పాఠశాలకు చెందిన ఎం పూజశ్రీ జపాన్‌లో జరిగే అంతర్జాతీయ ప్రదర్శనకు ఎంపికైంది. గురువారం అల్ఫోర్స్ ముఖ్య కార్యాలయంలో విద్యార్థినిని విద్యాసంస్థల అధినేత వీ నరేందర్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓదెల మండలం కొలనూర్ గ్రామానికి చెందిన పూజశ్రీ సుల్తానాబాద్ అల్ఫోర్స్ పాఠశాలలో ఇటీవలే పదోతరగతి పూర్తి చేసిందని పేర్కొన్నారు. గతంలో జాతీయస్థాయి ఇన్స్పైర్ అవార్డ్స్‌లో వీల్ ఆక్సిల్ కెమెరాపై అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిందని తెలిపారు. దీంతో ఈ నెల 19 నుంచి 25 వరకు జపాన్‌లోని సకురాలో జరిగే అంతర్జాతీయ స్థాయి ఇన్స్పైర్ అవార్డ్స్ వేడుకల్లో పాల్గొనన్నదని వివరించారు. పూజశ్రీ అంతర్జాతీయ స్థాయిలోనూ అద్భుత ప్రదర్శన చేసి దేశానికి, రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపును తీసుకురావాలని ఆకాంక్షించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

