జలవిహార్‌లో అలయ్ బలయ్
Alai Balai at Jalavihar | నగరంలో జలవిహార్‌లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తనయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం అలయ్ బలయ్ కార్యక్రమం

హైదరాబాద్ : నగరంలో జలవిహార్‌లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తనయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం అలయ్ బలయ్ కార్యక్రమం జరుగుతున్నది. కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ తమిళిసై, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత, జనసేన అధినేత పవన్ కల్యాణ్, భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్ల, చాడ వెంకట్‌రెడ్డి, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు, ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు, బీజేపీ నేత బండి సంజయ్, లక్ష్మణ్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన ప్రముఖులకు దత్తాత్రేయ, ఆయన కుటుంబీకులు ఘన స్వాగతం పలికారు.
అలయ్ బలయ్ కార్యక్రమంలో భాగంగా తమిళిసై సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మహిళలతో కలిసి నృత్యం చేశారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కార్యక్రమంలో భాగంగా దుర్గామాత, జమ్మిచెట్టుకు పూజలు చేశారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా ఆలింగనాలతో కాకుండా నమస్కారాలతో అలయ్ బలయ్‌ను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రాచీన భారతీయ నాగరికతను కాపాడుకోవాలి : ఉప రాష్ట్రపతి
ప్రాచీన భారతీయ నాగరికతను కాపాడుకోవాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. వేరైనా మనమంతా భారతీయులమన్నారు. ప్రపంచ సంస్కృతుల్లో భారతీయ సంస్కృతి విశిష్టమైందన్నారు. బతుకమ్మ, బోనాలు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తాయని, ప్రతి ఒక్కరూ పండుగలో పాల్గొనాలన్నారు. రుచులు, అభిరుచులు మారుతున్నాయని, ప్రకృతితో కలిసి జీవించండి.. ప్రకృతిని కాపాడాలంటూ పిలుపునిచ్చారు. కరోనా ముప్పు తొలగిపోలేదని, ప్రతి ఒక్కరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు పాటించాలన్నారు. భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని సూచించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ హైదరాబాద్ ప్రగతికి దత్తాత్రేయ అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. రాజకీయాలకు అతీతంగా ఆహ్వానించడం శుభపరిణామమన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమం లేదన్నారు.
పలువురు ప్రముఖులకు సన్మానం
అలయ్ బలయ్ కార్యక్రమంలో పలువురు ప్రముఖులను అతిథులు సన్మానించారు. భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా, బయోలాజికల్-ఈ ఎండీ మహిమ దాట్ల, డాక్టర్ రెడ్డీస్ లేబోరేటరీస్ అధినేత ప్రసాద్‌రెడ్డి, ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ) ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సన్మానించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

