Shamshabad | సేవల పునరుద్ధరణ.. శంషాబాద్ నుంచి యథాతధంగా విమానాల రాకపోకలు
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (Shamshabad) నుంచి విమానాలు యథావిధిగా నడుస్తున్నాయి. కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టం మైక్రోసాఫ్ట్ విండోస్ పనిచేయకపోవడంతో విమాన సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది.
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (Shamshabad) నుంచి విమానాలు యథావిధిగా నడుస్తున్నాయి. కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టం మైక్రోసాఫ్ట్ విండోస్ పనిచేయకపోవడంతో విమాన సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో శుక్రవారం శంషాబాద్ నుంచి రాకపోకలు సాగించే పలు విమానాలు రద్దయ్యాయి. మరికొన్ని విమానాల రాకపోకల్లో తీవ్ర జాప్యం తలెత్తింది. దేశ విదేశాలకు వెళ్లాల్సిన 36 విమాన సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఎయిర్పోర్ట్ నుంచి విమాన సేవలను పునరుద్ధరించారు. ప్రస్తుతం యథావిధిగా విమానాలు నడుస్తున్నాయని అధికారులు వెల్లడించారు.
కాగా, రద్దయిన విమానాల్లో వెళ్లాల్సిన ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏ విధమైన ప్రత్యామ్నాయం కల్పించాలనే విషయమై విమానయాన సంస్థలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇక విమానాల రాకపోకలకు సంబంధించిన కార్యకలాపాలన్నీ కంప్యూటర్ల మీదే జరుగుతాయి. శుక్రవారం మైక్రోసాఫ్ట్ విండోస్ సాంకేతిక సమస్య కారణంగా విమాన ప్రయాణికుల వివరాలను తనిఖీ, బోర్డింగ్ పాస్‌ల జారీని ఇవ్వలేకపోయారు. కొన్ని విమానాల రాకపోకలను కొనసాగించేందుకు బోర్డింగ్ పాస్‌లను మాన్యువల్‌గా రాసి ఇచ్చి విమానాల ప్రయాణాలు సాగేలా చర్యలు చేపట్టారు. సాంకేతిక సమస్య వల్ల విమాన సర్వీస్ సిగ్నళ్లకూ అంతరాయం ఏర్పడింది. అయితే విమాన సర్వీసుల రద్దు వల్ల కొందరు ప్రయాణికులు 7-8 గంటలపాటు ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

