న్యూఢిల్లీ : ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్(59) భారత వైమానిక దళం(ఐఏఎఫ్) 29వ అధిపతిగా నియమితులయ్యారు. ఈ నెల 13న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఐఏఎఫ్ వైస్ చీఫ్‌గా ఉన్న ఆయన నిరుడు పాకిస్థాన్‌తో జరిగిన ఆపరేషన్ సిందూర్‌కు నేతృత్వం వహించారు. ఫైటర్ పైలట్‌గా సుమారు నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న ఆయనకు తేలికపాటి యుద్ధ విమానం తేజస్ ప్రాజెక్ట్‌తో దగ్గరి అనుబంధం ఉన్నది.
మిరాజ్-2000, మిగ్ రకాలు, కిరణ్, జాగ్వార్, ఐఎల్-78, హక్, తేజస్ లాంటి యుద్ధ విమానాలను నడిపిన అనుభవం ఆయనకు ఉంది. వైమానిక సిబ్బంది డిప్యూటీ చీఫ్ సహా పలు కీలక పదవుల్లో పనిచేసిన ఆయన ప్రణాళిక, విధానాలు, ఆపరేషన్స్‌లో కీలక పాత్ర పోషించారు. న్యూఢిల్లీలోని జాతీయ రక్షణ కళాశాల నుంచి ఆయన పట్టభద్రులయ్యారు. తన సేవలకు గుర్తింపుగా పరమ్ విశిష్ట్ సేవా పతకం సహా పలు మెడల్స్‌ను పొందారు.