నన్ను ఇరికించాలని చూస్తున్నరా?.. అడ్డగోలు ఫైళ్లు ఎందుకు పంపుతున్నరు?.. అధికారులపై వ్యవసాయశాఖ కార్యదర్శి ఫైర్
కోట్లాది రూపాయల విలువైన కీలకమైన పనులను నాకు చెప్పకుండా మీకు మీరే ఇష్టారాజ్యంగా మొ దలుపెట్టి, ఇప్పుడు నా సంతకాలు ఎందుకు అడుగుతున్నరు? అడ్డగోలు ఫైళ్లను నా ముందు ఎందుకు పెడుతున్నరు? నన్ను ఇరికించాలని చూస్తున్నరా? అని ఆ యిల్ఫెడ్ బోర్డు, వార్షిక సమావేశాల్లో సీనియర్ ఐఏఎస్ అధికారి, వ్యవ సాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ అధికారులపై మండిపడినట్టు తెలిసింది.
- మీకు మీరే కీలక పనులు మొదలుపెట్టి, నా సంతకాలు ఎందుకు అడుగుతున్నరు?
- ఆయిల్‌ఫెడ్ సమావేశాల్లో వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ వ్యాఖ్యలు
హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): కోట్లాది రూపాయల విలువైన కీలకమైన పనులను నాకు చెప్పకుండా మీకు మీరే ఇష్టారాజ్యంగా మొ దలుపెట్టి, ఇప్పుడు నా సంతకాలు ఎందుకు అడుగుతున్నరు? అడ్డగోలు ఫైళ్లను నా ముందు ఎందుకు పెడుతున్నరు? నన్ను ఇరికించాలని చూస్తున్నరా? అని ఆ యిల్ఫెడ్ బోర్డు (Oil Fed Board), వార్షిక సమావేశాల్లో సీనియర్ ఐఏఎస్ అధికారి, వ్యవ సాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ (Surendra Mohan) అధికారులపై మండిపడినట్టు తెలిసింది. నిధులకు సంబంధించిన దస్ర్తాలపై ఎలాంటి చర్చ లేకుండా.. సంతకాలు ఎలా పెట్టాలని నిలదీసినట్టు సమాచారం. చర్చ లేకుండా కీలక దస్ర్తాలపై సంతకాలు చేయబోనని స్పష్టంచేయడంతో సమావేశం అర్ధాంతరంగా ముగిసినట్టు తెలిసిం ది. వారం క్రితం జరిన ఈ ఉదంతంపై వ్యవసాయశాఖలో జోరుగా చర్చ జ రుగుతున్నది.
రెండు మూడు ఫైళ్లు చూసి షాక్‌కు గురైన కార్యదర్శి.. ఇలాంటి ఇరికించే కార్యక్రమాలు పెట్టొద్దు… నన్ను ఇరికించాలని చూస్తున్నరా? అని ముఖం మీదనే చెప్పడంతో ఆయిల్‌ఫెడ్ అధికారులు విస్తుపోయినట్టు తెలిసింది. ఇంతలో ఓ ముఖ్యమైన అధికారి జోక్యం చేసుకొని ‘సార్.. కనీసం ఇప్పటికే పూర్తయిన కొనుగోళ్లకు సంబంధించిన ఫైళ్లనైనా అప్రూవ్ చేయండి. లేదంటే బిల్లు లు పెండింగ్‌లో పడుతాయి’ అని విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. ఎట్టి పరిస్థితిలోనూ అడ్డగోలు ఫైళ్లపై సంతకాలు చేసే ప్రసక్తే లేదని కార్యదర్శి ని రాకరించినట్టు తెలిసింది. అన్ని ఫైళ్లను పూర్తిగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటానని తేల్చి చెప్పినట్టు సమాచారం. ఆయిల్‌ఫెడ్ వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయని కార్యదర్శి భావిస్తున్నారా? అలాంటివి ఆయన దృష్టికి వెళ్లాయా? అందుకే ఆ వ్యాఖ్యలు చేశారా? అని అధికారుల్లో చర్చ జరుగుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

