కొవిడ్ సంక్షోభం అనంతరం ఉద్యోగ కల్పనలో తెలంగాణ దూసుకుపోతున్నది. సంఘటిత రంగంలో అత్యధిక ఉద్యోగాలను సృష్టిస్తున్న టాప్-5 రాష్ర్టాల జాబితాలో తెలంగాణ చోటుదక్కించుకున్నది. మొత్తం శ్రామికశక్తిలో ఏటా 3-5 శాతం కొత్త ఉద్యోగాలను సృష్టిస్తూ రికార్డు సృష్టిస్తున్నది. ఈ సంగతి ఈపీఎఫ్వో రిజిస్ట్రేషన్ గణాంకాల్లో వెల్లడైంది. ఇదే సమయంలో బీజేపీపాలిత యూపీ మాత్రం ఉద్యోగకల్పనలో వెనుకబడిపోతుండటం గమనార్హం.