కాకతీయ జూలాజికల్ పార్కులో జంతువుల దత్తత
వరంగల్లోని కాకతీయ జూలాజికల్ పార్కు జంతు ప్రేమికులను ఆకర్షిస్తున్నది. స్వయంగా పక్షుల ఆలన, పాలన సంరక్షణ చూసేవారికి పక్షులు, జంతువులను దత్తత ఇస్తున్నది.
హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): వరంగల్లోని కాకతీయ జూలాజికల్ పార్కు జంతు ప్రేమికులను ఆకర్షిస్తున్నది. స్వయంగా పక్షుల ఆలన, పాలన సంరక్షణ చూసేవారికి పక్షులు, జంతువులను దత్తత ఇస్తున్నది. 2016లోనే ఈ పథకాన్ని ప్రారంభించగా, ఇప్పటి వరకు 90 మంది వివిధ జంతువులు, పక్షులను దత్త త తీసుకున్నారని జూలాజికల్ పార్కు అధికారి మయూరి తెలిపారు. దత్తత తీసుకున్నవారిపై భారం పడకుండా 3, 6 నెలలు, ఏడాది స్కీంను అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. పక్షులను దత్తత తీసుకోవాలనుకొనే దాతలు జిల్లా అటవీ అధికారి హనుమకొండ 9440810093, ఫారెస్ట్ రేంజర్ జూలాజికల్ పార్క్ 80199 19959, సెక్షన్ ఆఫీసర్ జూలాజికల్ పార్క్ 7780378972లో లేదా www.kaka tiyazoo.in వెబ్సైట్ను సంప్రదించాలి.
భార్యను చంపి భర్త సూసైడ్
కాశీబుగ్గ, జూలై 9: కుటుంబ తగాదాల తో భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన గ్రేటర్ వరంగల్లో మంగళవారం చోటుచేసుకుంది. నగరంలోని 18 వ డివిజన్ చెన్నారెడ్డి కాలనీకి చెందిన మం ద చేరాలు (45), స్వప్న (42) దంపతు లు. వీరికి అంధుడైన కుమారుడితోపాటు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. చేరాలు మేస్త్రీ పనిచేస్తుండగా, స్వప్న బట్టల దుకాణంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నది. సోమవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరగగా.. చేరాలు స్వప్నను రోకలిబండతో తలపై బాది హత్య చేశాడు. మంగళవారం ఉదయం చేరాలు పురుగు మందు తాగి మృతి చెందాడు. ఉదయం 11 గంటల సమయంలో పిల్లలను బంధువులు తీసుకురాగా ఇంటికి గొల్లెం పెట్టి ఉన్నది. పక్క నుంచి తలుపులు తీసి చూడగా వారు విగతజీవులుగా పడి ఉన్నారు. పక్కింటివారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు మృతి చెందడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు.
పాముకాటుతో రైతు మృతి
కల్వకుర్తి రూరల్, జూలై 9: పొలం వ ద్ద పాముకాటుతో రైతు మృతి చెందాడు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. కల్వకుర్తి పట్టణం జేఎల్బీ రోడ్డులో ఉండే రైతు వసంత యాదయ్య (48) మంగళవారం వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. ఎల్లికల్ రోడ్డు కైలాసంగుట్ట సమీపంలో బోరు మోటరు ఆన్చేసే క్రమంలో పాముకాటుకు గురయ్యాడు. పక్కపొలంలోని రైతులు గమనించి అతడిని దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

