నేడు రెవెన్యూలో వీఆర్ఏల సర్దుబాటు
రెవెన్యూ శాఖలో బుధవారం వీఆర్ఏల సర్దుబాటు ప్రక్రియ హైదరాబాద్ సీసీఎల్ఏలో జరుగనున్నది.
హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): రెవెన్యూ శాఖలో బుధవారం వీఆర్ఏల సర్దుబాటు ప్రక్రియ హైదరాబాద్ సీసీఎల్ఏలో జరుగనున్నది. 20,555 మంది వీఆర్ఏలను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్హత ఆధారంగా వారికి ఆఫీస్ సబార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పేస్కేల్ వర్తింపజేసింది. వీరిలో 16,758 మంది 61 ఏండ్లలోపు వయసున్న వారు ఉన్నారు. వారిని ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఇటీవలే సుమారు 15 వేల పోస్టులను మంజూరు చేసింది. కలెక్టర్లు జిల్లాల వారీగా వీఆర్ఏల విద్యార్హత, వయసు తదితర అంశాలవారీగా జాబితాను సేకరించి, ప్రభుత్వానికి అందజేశారు. రెవెన్యూ శాఖ వారికి అలాట్మెంట్ ఆర్డర్లు ఇవ్వనున్నది. నిర్ణీత గడువులోగా సంబంధిత శాఖలోని ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేయాలి. అపాయింట్మెంట్ పూర్తికాగానే తహసీల్దార్లు తమ పరిధిలో నుంచి వీఆర్ఏలను రిలీవ్ చేస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- CCLA
- Revenue Officers
- VRAs
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

