Betting Apps Issue | బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం.. విచారణకు హాజరైన విష్ణుప్రియ
బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం వ్యవహారంలో (Betting Apps Issue) నటి విష్ణుప్రియ పోలీసు విచారణకు హాజరయ్యారు. గురువారం ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఆమె.. విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం కల్పిస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, టీవీ నటులపై కేసులు నమోదయ్యాయి.
హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం వ్యవహారంలో (Betting Apps Issue) నటి విష్ణుప్రియ పోలీసు విచారణకు హాజరయ్యారు. గురువారం ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఆమె.. విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం కల్పిస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, టీవీ నటులపై కేసులు నమోదయ్యాయి. ఇమ్రాన్‌ఖాన్, హర్షసాయి, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, శ్యామల, రీతూ చౌదరి, సుప్రీత, అజయ్, సన్నీ యాదవ్, సందీప్‌లపై బీఎన్ఎస్ 318(4) 3, 3ఏ, టీఎస్జీఏ, 66డీఐటీఏ-2008 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో విచారణకు రావాలంటూ విష్ణుప్రియకు పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే.
ఈ బెట్టింగ్ యాప్స్ కారణంగా చాలామంది లక్షలాది రూపాయలు నష్టపోయిన విషయం తెలిసిందే. ఇటీవల సోషల్ మీడియాలో ఈ బెట్టింగ్ యాప్స్‌పై పోరాటం జరుగుతున్నది. దీనికి తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ వీసీ సజ్జనార్ సైతం మద్దతు పలికారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసే వారిని అన్‌ఫాలో చేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పలువురు బెట్టింగ్ యాప్స్‌ని ప్రచారం చేసిన వారంతా.. ఇప్పుడు తమ వీడియోలను తొలగిస్తున్నారు. తాము తెలియక తప్పులు చేశామని.. మరోసారి అలాంటి తప్పులు చేయమోమని ప్రకటించారు. బెట్టింగ్ యాప్స్‌ని ఎవరూ నమ్మొద్దంటూ సూచిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

