నాగరికత పెరుగుతున్నా.. మహిళల పట్ల వివక్ష
నాగరికత పెరుగుతున్నప్పటికీ మహిళల పట్ల వివక్ష కొనసాగుతున్నదని హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ సుజయ్‌పాల్ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల పట్ల ఎకడ వివక్ష ఉందో ఆదిలోనే గుర్తించి దానిని రూపుమాపినప్పుడే సమానత్వం సాధ్యమవుతుందని చెప్పారు.
- సమస్యను ఆదిలోనే గుర్తిస్తే సమానత్వం సాధ్యం
- హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజయ్‌పాల్
హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): నాగరికత పెరుగుతున్నప్పటికీ మహిళల పట్ల వివక్ష కొనసాగుతున్నదని హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ సుజయ్‌పాల్ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల పట్ల ఎకడ వివక్ష ఉందో ఆదిలోనే గుర్తించి దానిని రూపుమాపినప్పుడే సమానత్వం సాధ్యమవుతుందని చెప్పారు. జెండర్ సెన్సిటైజేషన్ అండ్ ఇంటర్నల్ కంప్లెయింట్ కమిటీ నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు హైకోర్టు బార్ అసోసియేషన్ గురువారం బహుమతులను ప్రదానం చేసింది.
ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్ సుజయ్‌పాల్ ప్రసంగిస్తూ.. పురాణాల్లో మహిళలను పూజించిన చోట దేవతలు ఉంటారన్నది ఆచరణలో ఉండి ఉంటే మహిళల రక్షణ కోసం సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం, లోక్‌సభ చట్టాలు చేయడం అవసరమై ఉండేది కాదని అన్నారు. దేశంలోని పలు కింది కోర్టుల్లో మహిళలు 50 నుంచి 60% వరకు ఉన్నారని చెప్పారు. మధ్యప్రదేశ్‌లో 70 శాతానికి చేరారని తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని కోర్టుల్లో 33% రిజర్వేషన్లను ప్రభుత్వం కల్పించిందన్నారు. ఇప్పుడు అక్కడ పురుషులకు రిజర్వేషన్లు కల్పించాలనే పరిస్థితులు వస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి, జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్, జస్టిస్ జే శ్రీనివాసరావు, జస్టిస్ టీ మాధవీదేవి, జస్టిస్ జువ్వాడి శ్రీదేవి, బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Jagadish Reddy | తెలంగాణ నీటి హక్కులను సీఎం తన గురువు చంద్రబాబు చేతిలో పెట్టిండు : జగదీష్‌రెడ్డి
KTR | బక్క పలచని యోధుడు బానిస సంకెళ్లు తెంచిన కథ.. మన తెలంగాణ జాతి కథ : కేటీఆర్
Health Tips | నిమ్మరసాన్ని దేంట్లో పడితే దాంట్లో వాడుతున్నారా .. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
KTR | ఉద్యమానికి ఊపిరులూదిన కరీంనగర్ ఖిల్లా ఇది : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

