కొడంగల్, డిసెంబర్ 2: వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో గత నెల 11న జరిగిన ఘటనకు సంబంధించిన కేసులో నిందితు లు నలుగురు సోమవారం కొడంగల్ కోర్టులో లొంగిపోయారు. ఉదయం న్యాయవాదితో కలిసి లగచర్ల గ్రామానికి చెందిన నార్ల హన్మంతు, కుమ్మరి శివకుమార్, దొరమోని రాంచందర్, రోటిబండతండాకు చెందిన లోక్యానాయక్ కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరై లొంగిపోగా 14 రోజులపాటు రిమాండ్ విధించారు.
యూజీసీకి నోచుకోని మహిళా వర్సిటీ
హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన మహిళా యూనివర్సిటీ ప రిస్థితి అగమ్యగోచరంగా తయారైం ది. ఈ వర్సిటీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) గుర్తింపు లేకుం డా నడుస్తున్నది. విద్యార్థులు ప్రవేశా లు పొందుతున్నారు.. క్లాసులు నడుస్తున్నాయి. కానీ ఈ వర్సిటీని ఏర్పా టు చేస్తూ ఇప్పటి వరకు అసెంబ్లీలో చట్టాన్ని రూపొందించకపోవడంతో యూజీసీ గుర్తింపును దక్కించుకోలేకపోయింది. ఇటీవలే ఈ వర్సిటీ పేరు ను కాంగ్రెస్ ప్రభుత్వం వీరనారి చిట్యాల ఐలమ్మ మహిళా వర్సిటీగా పేరుమార్చారు. ఏడాది గడిచినా ఇం త వరకు వర్సిటీ యాక్ట్‌ను రూపొందించకపోవడంతో యూజీసీ గుర్తింపును నోచుకోలేకపోయింది. విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడంలేదు. దీంతో తమ భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని వాపోయారు.