హెచ్ఎండీఏలో ఏసీబీ సోదాలు
అవినీతి ఆనవాళ్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)ని వెంటాడుతున్నాయి.
- ప్లానింగ్ విభాగంలో తనిఖీలు
- శివ బాలకృష్ణ గతంలో ఇచ్చిన
- నిర్మాణ అనుమతుల పరిశీలన
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 29 (నమస్తే తెలంగాణ): అవినీతి ఆనవాళ్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)ని వెంటాడుతున్నాయి. హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగం డైరెక్టర్గా పనిచేసిన శివ బాలకృష్ణ ఇంట్లో ఆదాయానికి మించి రూ.500 కోట్లు ఆస్తులు వెలుగుచూడటంతో అతడు గతంలో ఇచ్చిన నిర్మాణ అనుమతులపై కూడా ఏసీబీ ఆరా తీస్తున్నది. ఏసీబీ అధికారులు ఆదివారం సెలవు రోజు కూడా హెచ్ఎండీఏలో సోదాలు నిర్వహించినట్టు సమాచారం. అమీర్పేటలోని సర్వజయంతి కమర్షియల్ కాంప్లెక్సులో ఉన్న హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయం 4వ అంతస్థులోని ప్లానింగ్ విభాగం, 7వ అంతస్థులోని డైరెక్టర్ల చాంబర్లలోనూ భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతుల పైళ్లను తనిఖీ చేసినట్లు తెలిసింది. ప్లానింగ్ విభానికి చెందిన ముఖ్యమైన అధికారులు, ఉద్యోగులను ప్రత్యేకంగా పిలిపించి, బాలకృష్ణ హయాంలో అనుమతులు ఇచ్చిన ఫైళ్లను బయటకు తీసి, వాటిని వివరాలను ఏసీబీ అధికారులు పరిశీలించి వెళ్లినట్టు సమాచారం. ఏసీబీ సోదాలతో హెచ్ఎండీఏలో అధికారుల గుండెల్ల్లో రైళ్లు పరుగులు పెట్టిస్తున్నాయి. హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఓ అధికారి శివ బాలకృష్ణ ఇంటిపై ఏసీబీ సోదాలు జరిగిన తర్వాత నుంచి సెలవుపై వెళ్లిపోయినట్టు సమాచారం. ఈయన బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ అన్ని విషయాల్లో సహకరించేవాడని తెలిసింది. ఈ సోదాలు ఇంకా కొనసాగే అవకాశం ఉన్నట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

