Veldanda SI | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ వెల్దండ ఎస్ఐ
Veldanda SI | నాగర్‌కర్నూల్ (Nagarkarnool) జిల్లాలోని వెల్లండ (Veldanda) పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఎస్ఐ రవికుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీ (ACB) అధికారులకు పట్టుబడ్డాడు. ఓ కేసులో నిందితుడి నుంచి ఎస్సై లంచం అడిగినట్టుగా సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఎస్సైని రెడ్ హ్యాండెడ్‌గా దొరకబట్టారు.
Veldanda SI : నాగర్‌కర్నూల్ (Nagarkarnool) జిల్లాలోని వెల్లండ (Veldanda) పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఎస్ఐ రవికుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీ (ACB) అధికారులకు పట్టుబడ్డాడు. ఓ కేసులో నిందితుడి నుంచి ఎస్సై లంచం అడిగినట్టుగా సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఎస్సైని రెడ్ హ్యాండెడ్‌గా దొరకబట్టారు.
ఇటీవల కల్వకుర్తికి చెందిన వెంకటేష్ ఇంట్లో జిలెటెన్ స్టిక్స్ పట్టుబడ్డాయి. దీనికి సంబంధించి కేసు నమోదు చేయకుండా ఉండాలంటే రూ.50 వేలు లంచం ఇవ్వాలని వెల్దండ ఎస్సై రవికుమార్ డిమాండ్ చేశాడు. దాంతో వెంకటేశ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు వెంకటేశ్ ఎస్సైకి ఫోన్ చేసి లంచం ఇచ్చేందుకు అంగీకరించాడు.
అయితే ఎస్సై నేరుగా మాట్లాడకుండా అతని డ్రైవర్‌తో ఫోన్ చేయించి కాన్ఫరెన్స్‌లో వెంకటేశ్‌తో మాట్లాడాడు. ఎస్సై సూచన మేరకు వెంకటేశ్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి రూ.50 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఎస్సైని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

