ఏసీబీకి చిక్కిన ఏవో
ట్రేడర్స్ రెన్యూవల్ కోసం లంచం తీసుకుంటున్న మండల వ్యవసాయాధికారిని ఏసీబీ అధికారులు సోమవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు ఏబీసీ డీఎస్పీ రమణమూర్తి మీడియాకు వివరాలు వెల్లడించారు.
- మారుతి ట్రేడర్స్ రెన్యూవల్ కోసం లంచం డిమాండ్
- రూ.38 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
దహెగాం, మే 27: ట్రేడర్స్ రెన్యూవల్ కోసం లంచం తీసుకుంటున్న మండల వ్యవసాయాధికారిని ఏసీబీ అధికారులు సోమవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు ఏబీసీ డీఎస్పీ రమణమూర్తి మీడియాకు వివరాలు వెల్లడించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం అయినం గ్రామంలోని మారుతి ట్రేడర్స్ (ఫర్టిలైజర్ అండ్ సీడ్స్) దుకాణం రెన్యూవల్ కోసం యజమాని చౌదరి శ్యాంరావు గత నెల 27న ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు. రెన్యూవల్ కాకపోవడంతో మండల వ్యవసాయాధికారి వంశీకృష్ణను సంప్రదించాడు.
ఫర్టిలైజర్ దుకాణానికి రూ.20 వేలు, సీడ్స్ షాపునకు రూ.18 వేలు లంచం ఇస్తేనే రెన్యూవల్ చేస్తానని ఏవో చెప్పాడు. చేసేది లేక శ్యాంరావు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి ప్లాన్ ప్రకారం.. సోమవారం శ్యాంరావు ఏవోకు ఫోన్ చేసి డబ్బులు ఇస్తానని, ఎక్కడికి రమ్మంటారని అడిగాడు. దహెగాంలోని ఓ ఫర్టిలైజర్ దుకాణంలో ఉన్నానని చెప్పగా.. శ్యాంరావు డబ్బులతో అక్కడికి వెళ్లాడు. మొదట తన షాపు రెన్యూవల్‌కు సంబంధించిన రికార్డులపై సంతకాలు చేయించుకున్న తర్వాత ఏవోకు రూ.38 వేలు అందించాడు. ఆ డబ్బులతో తన కారులో వస్తున్న ఏవోను ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నగదును స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Acb
- agriculturist
- bribe
- fertilizer
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

