హైదరాబాద్ : ఈ నెల 1వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణ విద్యా శాఖ అకాడమిక్ క్యాలెండర్‌ను శనివారం విడుదల చేసింది. మొత్తం 213 రోజులు పని దినాలు ఉండగా, ఇందులో 166 రోజుల పాటు ప్రత్యక్ష తరగతులు జరగనున్నాయి. మిగతా 47 రోజుల్లో వర్చువల్ మెథడ్‌లో తరగతులు నిర్వహించనున్నారు. ఇక పదో తరగతి విద్యార్థులకు 2022, జనవరి 10వ తేదీ నాటికి సిలబస్ పూర్తి చేయాలని అధికారులు పేర్కొన్నారు. ఫిబ్రవరి 28 నుంచి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్చి, ఏప్రిల్ మాసాల్లో టెన్త్ ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని వెల్లడించారు. పాఠశాలల చివరి వర్కింగ్ డే ఏప్రిల్ 23. ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు వేసవి సెలవులు ప్రకటించారు.
దసరా సెలవులు : 06.10.2021 to 17.10.2021 (12 రోజులు )
క్రిస్మస్ సెలవులు : 22.12.2021 to 28.12.2021 (7 రోజులు )
సంక్రాంతి సెలవులు : 11.01.2022 to 16.01.2022 (6 రోజులు )
వేసవి సెలవులు : 24.04.2022 to 12.06.2022