కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి నిరసన సెగ
దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ మండిపోతుండటంతో కేంద్రంలోని బీజేపీ సర్కారుపై అడుగడుగునా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సెగ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికీ తగిలింది. పెట్రోల్, డీజిల్ సహా ఇతర నిత్యావసర వస్తువుల ధలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆమ్ ఆద్మీ పార్టీ
ధరల పెరుగుదలపై ఆప్ ఆందోళన
కేంద్ర మంత్రిని అడ్డుకొన్న కార్యకర్తలు
అబిడ్స్/సుల్తాన్‌బజార్, మే 30: దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ మండిపోతుండటంతో కేంద్రంలోని బీజేపీ సర్కారుపై అడుగడుగునా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సెగ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికీ తగిలింది. పెట్రోల్, డీజిల్ సహా ఇతర నిత్యావసర వస్తువుల ధలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకులు, కార్యకర్తలు నాంపల్లిలోని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఆ సమయంలో కలెక్టరేట్లో ఓ కార్యక్రమాన్ని ముగించుకొని వెళ్తున్న కిషన్‌రెడ్డి కాన్వాయ్‌ని ఆప్ నాయకులు, కార్యకర్తలు అడ్డుకొన్నారు.
‘నరేంద్రమోదీ.. డౌన్ డౌన్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. వారితో బీజీపీ కార్పొరేటర్లు, నాయకులు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. దీంతో పోలీసులు అప్రమత్తమై ఇరు వర్గాలను అక్కడి నుండి తరలించారు. అనంతరం ఆప్ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలను పెంచి పేదల నడ్డి విరుస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని వెంటనే తగ్గించకుంటే మోదీ సర్కారుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

