హైదరాబాద్ : దుండిగల్ పోలీస్ స్టేషన్ (Dundigal Police Station) పరిధిలోని బహదూర్ పల్లి(Bahadurpally) రహదారి పక్కన అనుమానాస్పద(Suspicious condition) స్థితిలో ఓ యువకుడి మృతదేహం(Young man died) లభించడం కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడి తలకు బలమైన గాయం కావడంతో గుర్తుతెలియని వాహనం అతన్ని ఢీ కొట్టేందా? లేక ఎవరైనా కొట్టి చంపారా అనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.