Software Job | ఓదెల, మార్చి 16: సాఫ్ట్వేర్ కొలువు రావడం లేదని పెద్దపల్లి జిల్లా ఓదెలలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఓదెల మండల కేంద్రానికి చెందిన ముద్దసాని వెంకటసాయి (28) బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళ్లినా జాబ్ రాలేదు. దీంతో మనస్తాపం చెందాడు. గురువారం రాత్రి పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.
కుటుంబీకులు గమనించి, కరీంగనర్, ఆ తర్వాత హైదరాబాద్ దవాఖానలకు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్టు వారు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.