Alcohol | మద్యం తాగి పాఠశాలలో పడిపోయిన ఉపాధ్యాయుడు.. పశువుల కొట్టంలో పడుకోబెట్టిన స్థానికులు
Alcohol | విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతూ వారికి మార్గదర్శకంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడే..(School teacher) వారి ముందు దారితప్పి ప్రవర్తించాడు. అందునా ఉదయమే పూటుగా మద్యం తాగి(Drinking alcohol) పాఠశాలకు వచ్చాడు.
ఖమ్మం : విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతూ వారికి మార్గదర్శకంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడే..(School teacher) వారి ముందు దారితప్పి ప్రవర్తించాడు. అందునా ఉదయమే పూటుగా మద్యం తాగి(Drinking alcohol) పాఠశాలకు వచ్చాడు. పూర్తిగా నిషాలో ఉన్న అతడు.. కనీసం నాలుగు అడుగులు నడిచి పాఠశాలలోకి వెళ్లేంత శక్తిలేని స్థితిలో ఉన్నాడు. పిల్లలందరూ చూస్తుండగానే స్వయంగా వారి ఎదుటే తూళుతూ నడిచాడు. ఒక్క అడుగు కూడా సక్రమంగా వేయలేక బడి బయటే కుప్పకూలి మత్తులోకి జారుకున్నాడు.
విద్యార్థులతోపాటు గ్రామస్తులు కూడా నిశ్చేష్టులై చూసిన ఈ ఘటన భద్రాద్రి జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, విద్యార్థుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తిమ్మంపేట పంచాయతీ రాజీవ్‌నగర్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో రెండేళ్లుగా ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పత్తిపాటి వీరయ్య.. తరచూ మద్యం తాగి విధులకు హాజరవుతుంటాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం కూడా పూటుగా మద్యం తాగి నడవలేని స్థితిలో పాఠశాల వద్దకు వచ్చాడు.
పూర్తి మద్యం మత్తులో ఉన్న అతడు.. నడిచే శక్తి లేని స్థితిలో ఉండి పాఠశాల బయటే పడిపోయాడు. ఈ దృశ్యాన్ని గమనించిన స్థానికులు కొద్దిసేపటి తరువాత వచ్చారు. స్పృహలో లేని అతడిని పక్కనే ఉన్న పశువుల కొట్టంలోకి తీసుకెళ్లి చాప మీద పడుకోబెట్టారు. కాగా, రెండేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్న ఇతడు తరచూ ఇలాగే మద్యం తాగి విధులకు హాజరవుతున్నట్లు స్థానికులు చెప్పారు. గతంలో అనేకసార్లు తాము ఇతడి విషయాన్ని మండల అధికారుల దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. వారు అతడిని మందలించినప్పటికీ అతడిలో మార్పు రావడం లేదని, గౌరవప్రదమైన వృత్తికి మచ్చ తెస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Goat | `ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుడిగాలి సుధీర్‌కు దివ్యభారతి షాక్.. హీరో పేరు ప్రస్తావించకుండానే స్పీచ్!
AP News | రూ.500 తిరిగి ఇవ్వలేదని.. వ్యక్తిపై మరిగే నూనె పోసిన మహిళ.. నెల్లూరులో దారుణం
Gang Rape | తుపాకీతో బెదిరించి.. చెల్లెలి కళ్ల ముందే అక్కపై గ్యాంగ్ రేప్.. దీపావళి రాత్రి దారుణం
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ రికార్డుల వేట.. ఆరో రోజు కూడా తగ్గని జోరు, ఒక్కరోజే 1.25 మిలియన్ టికెట్లు!
Samantha | తొలి వ్యాపారంలోనే భారీ నష్టాలు.. అయినా వెనక్కి తగ్గని సమంత, ఇప్పుడు 10 స్టార్టప్స్‌లో పెట్టుబడులు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

