ఉస్మానియాలో అరుదైన శస్త్రచికిత్స
పేదల ధర్మాసుపత్రిగా పేరుగాంచిన హైదరాబాద్ ఉస్మానియా దవాఖానలో వైద్యులు మరో అరుదైన శస్త్రచికిత్స చేశారు. మూడేండ్ల బాలుడికి తల్లి కాలేయాన్ని విజయవంతంగా అమర్చి ఘనతను చాటారు.
- బాలుడికి కాలేయ మార్పిడి
- తల్లి కాలేయాన్ని అమర్చిన వైద్య బృందం
సుల్తాన్‌బజార్,జూలై 17: పేదల ధర్మాసుపత్రిగా పేరుగాంచిన హైదరాబాద్ ఉస్మానియా దవాఖానలో వైద్యులు మరో అరుదైన శస్త్రచికిత్స చేశారు. మూడేండ్ల బాలుడికి తల్లి కాలేయాన్ని విజయవంతంగా అమర్చి ఘనతను చాటారు. ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం కొండవనమాల గ్రామానికి చెందిన మోదుగు గుణశేఖర్, అమల దంపతుల కుమారుడు మాస్టర్ చౌహాన్ ఆదిత్య (3) పుట్టుకతోనే పిత్తాశయ ధమని, కాలేయ సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఉస్మానియా దవాఖానకు తీసుకురాగా, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యుడు డాక్టర్ మధుసూదన్ నేతృత్వంలోని బృందం వైద్య పరీక్షలను నిర్వహించింది. ఆదిత్యకు కాలేయ మార్పిడి చేయాలని ఆ వైద్యులు నిర్ణయించారు.
అతని తల్లి అమల తన కాలేయాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చారు. దీంతో ఈ నెల 3న ఆదిత్యకు తల్లి కాలేయం నుంచి కొంత భాగాన్ని తీసి కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం తల్లి, కుమారులిద్దరూ క్షేమంగా ఉండటంతో బుధవారం డిశ్చార్జి చేశారు. వైద్య బృందాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, ఉస్మానియ దవాఖానా సూపరింటెండెంట్ డాక్టర్ బీ నాగేందర్ ప్రత్యేకంగా అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

