Mulugu | భారీ వృక్షం మీద పడి బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మృతి.. ములుగు జిల్లాలో ఘటన
Mulugu | ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లి వద్ద గల 163వ జాతీయ రహదారిపై భారీ వృక్షం(Huge tree) కూలింది. ఈ ప్రమాదంలో చిన్నబోయినపల్లి గ్రామానికి చెందిన జహంగీర్ అనే వ్యక్తి మృతి చెందాడు.
ములుగు : ములుగు జిల్లాలో(Mulugu) వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు (Heavyrains) చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలుచోట్ల చెట్లు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తాజాగా జిల్లాలోని ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లి వద్ద గల 163వ జాతీయ రహదారిపై భారీ వృక్షం(Huge tree) కూలింది. ఈ ప్రమాదంలో చిన్నబోయినపల్లి గ్రామానికి చెందిన జహంగీర్ అనే వ్యక్తి మృతి చెందాడు.
స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జహంగీర్ తన ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా బోయిన పల్లి వద్దకు రాగానే ఒక్కసారిగా భారీ వృక్షం కూలి తన మీద పడడంతో ఆక్కడికక్కడే మృతి చెందాడు. సమా చారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కాగా, రోడ్డుకు అడ్డంగా చెట్టు విరిగిపడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

