యాదగిరిగుట్టలో కుప్పకూలిన భవనం.. నలుగురు మృతి
యాదాద్రి భువనగిరి : జిల్లాలోని యాదగిరిగుట్టలో శుక్రవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఓ పాత భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పలువురికి గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
భవనం శిథిలాల్లో మరికొందరు చిక్కుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కూలిన రెండంతస్తుల భవనం 35 ఏండ్ల క్రితం నిర్మించినట్లు స్థానికులు తెలిపారు. మృతులను యాదగిరిగుట్టకు చెందిన దశరథ్ గౌడ్, శ్రీను, ఉపేందర్, శ్రీనాథ్ గా పోలీసులు గుర్తించారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

