బ్యాక్లాగ్ పోస్టుల జంజాటం
జీవో-21లో స్వల్ప మార్పులు.. అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీపై సర్కార్‌కు నివేదిక
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి కొత్త చిక్కు వచ్చిపడింది. బ్యాక్లాగ్ పోస్టుల రూపంలో అడ్డంకి ఎదురవుతున్నది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం జారీ చేసిన జీవో-21 యూజీసీ రూల్స్‌కు విరుద్ధంగా ఉన్నట్టు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. జీవోను సవరించేందుకు శుక్రవారం సర్కార్ కీలక సంప్రదింపులు జరిపింది. అన్ని వర్సిటీల వీసీల నుంచి అభిప్రాయాలు సేకరించింది.
జీవో-21 సవరణపై ఉన్నత విద్యామండలి ఓ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఇంటర్వ్యూలకు 1:10 కోటాలో పిలువనున్నారు. విద్యార్హతలకు 50, రిసెర్చ్ పబ్లికేషన్స్‌కు 30, ఇంటర్వ్యూలకు 20 మార్కుల చొప్పున కేటాయించారు. యూజీసీ నిబంధనల మేరకు జీవోను సవరించాలని మెజార్టీ వీసీలు కోరారు.
కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను మినహాయించి, 500లోపు ఖాళీలను మాత్రమే భర్తీ చేయాలని ప్రభుత్వం భావించింది. దీనిని మెజారిటీ వీసీలు వ్యతిరేకించారు. 2వేల పోస్టులను ఒకే దఫాలో భర్తీచేయాలని కొందరు పట్టుబట్టినట్టు తెలిసింది. మొత్తంగా రెండు, మూడు రోజుల్లో జీవో-21ను సవరిస్తూ మరో జీవో జారీకానున్నట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

