TS RTC | ఆర్టీసీ కండక్టర్ కుటుంబాన్ని ఆదుకున్న నూతన అకౌంట్, రూపేకార్డు
TS RTC | టీఎస్ ఆర్టీసీ సంస్థలో ఉద్యోగులకు కొత్తగా తీసుకొచ్చిన విధానం ఓ కండక్టర్ కుటుంబానికి ఆర్థిక తోడ్పాటును అందించి అండగా నిలిచింది. వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ : టీఎస్ ఆర్టీసీ సంస్థలో ఉద్యోగులకు కొత్తగా తీసుకొచ్చిన విధానం ఓ కండక్టర్ కుటుంబానికి ఆర్థిక తోడ్పాటును అందించి అండగా నిలిచింది. వివరాలు ఇలా ఉన్నాయి. గత ఫిబ్రవరిలో జగిత్యాల డిపోనకు చెందిన కండక్టర్ సత్తయ్య జగిత్యాల నుంచి వరంగల్‌కు టీఎస్ఆర్టీసీ(TS RTC) బస్సులో వెళ్తుండగా రాంగ్రూట్లో వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కండక్టర్(Conductor) సత్తయ్య తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో ఇంటికి పెద్దదిక్కుకోల్పోవడంతో అతడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకొన్నాయి.
అయితే సంస్థ ఇటీవల ఆర్టీసీ సిబ్బంది, ఉద్యోగుల సాలరీ అకౌంట్స్(Salary Account)ను యూబీఐకి మార్చింది. ఆర్థిక ప్రయోజనంతో కూడిన సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్, రూపే కార్డు(Rupaycard) తీసుకోవాలని ప్రత్యేక మార్గదర్శకాలు జారీచేసింది. సంస్థలోని ఉద్యోగులందరూ వారు నివసిస్తున్న ప్రాంతాల్లోని యూబీఐ బ్రాంచీల్లో ఖాతాను తెరిచి రూపే కార్డులను తీసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన సత్తయ్య కూడా అకౌంట్, రూపే కార్డు పొంది ఉండడంతో ప్రమాద బీమా(Insurance) కింద రూ.40లక్షలు. రూపే కార్డు కింద మరో 10లక్షలను మొత్తం రూ.50లక్షల ఆర్థిక ప్రయోజనం పొందారు.
ఈ సందర్భంగా మంగళవారం బస్ భవన్లో సత్తయ్య కుటుంబ సభ్యులకు సంస్థ ఎండీ సజ్జనార్ (MD Sajjanaar) చెక్కులను అందజేశారు. కండక్టర్ సత్తయ్య భార్య బొల్లం పుష్ఫతో పాటు కొడుకు ప్రవీణ్ కుమార్, కూతురు మాధవి సంతోషాన్ని వ్యక్తం చేశారు. సజ్జనార్ మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమానికి సంస్థ అధిక ప్రాధాన్యత ఇస్తుందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్ వి.రవీందర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్‌సింగ్ పాటిల్, ఈడీలు ఎస్.కృష్ణకాంత్, వినోద్ ,యూబీఐ జనరల్ మేనేజర్ పి. క్రిష్ణణ్ రీజినల్హెడ్ డీ. అపర్ణరెడ్డి, డిప్యూటీ రీజినల్ హెడ్ జీవీ మురళీ కృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిరుపేద కుటుంబాలకు ‘మేవా’ ఆర్ధిక సాయం
‘రైతు సంక్షేమమే లక్ష్యంగా కృషి విజ్ఞాన కేంద్రం సేవలు’
Congress | ఢిల్లీ హోటల్లో తాగి కొట్టుకున్న మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు
‘ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి చెంప దెబ్బ కావాలి’
Gadwal Collector | కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతా.. పోలీసులకు ఫిర్యాదు చేసిన రిజ్వాన్ బాషా షేక్
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

