‘అమృత్ కాల్’ కంటే ‘మిత్ర్ కాల్’ అంటే బాగుంటుంది.. మీరేమంటారు .?: మంత్రి కేటీఆర్ ట్వీట్
కేంద్ర ప్రభుత్వం తమ పాలనా కాలాన్ని 'అమృత్ కాల్ (మంచి కాలం)'గా చెప్పుకుంటుండటంపై మంత్రి కేటీఆర్ ట్విటర్లో సైటెర్ వేశారు.
హైదరాబాద్: సోషల్ మీడియా ద్వారా కేంద్రంలోని బీజేపీ సర్కారును తరచూ ఏకిపారేసే రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తాజాగా మరో ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తమ పాలనా కాలాన్ని ‘అమృత్ కాల్ (మంచి కాలం)’గా చెప్పుకుంటుండటంపై మంత్రి కేటీఆర్ ట్విటర్లో సైటెర్ వేశారు. ‘అమృత్ కాల్’ అనే పదం కంటే ‘మిత్ర్ కాల్ (దోస్తుల కాలం)’ అనే పదం బాగా సూటవుతుందని తన ట్విటర్ అకౌంట్లో మంత్రి పోస్టు పెట్టారు. ‘ఎ మోర్ ఆప్ట్ నేమ్ ఫర్ అమృత్ కాల్ ఈజ్ ఎ మిత్ర్ కాల్, వాట్ డూ యూ సే గైస్..?’ అని మంత్రి ఆంగ్లంలో ట్వీట్ చేశారు.
A more apt name for “Amrit Kaal” is
“A Mitr Kaal”
What do you say Guys? #MitrVaad #CronyCapitalism
— KTR (@KTRBRS) February 21, 2023
మంత్రి ట్వీట్‌కు నెటిజన్ల నుంచి మంచి స్పందన కనిపిస్తున్నది. ఎనిమిదేండ్ల మోదీ పాలనలో మంచి రోజులు రాకపోగా.. దేశం అన్ని అంతర్జాతీయ సూచీల్లో వెనుకబడి పోయిందని పుట్ట విష్ణువర్ధన్‌రెడ్డి అనే ట్విటర్ యూజర్ రిప్లై ఇచ్చారు. అదానీకే అమృత కాలమని జగన్‌రెడ్డి అనే మరో ట్విటర్ యూజర్ పేర్కొన్నాడు.
‘మిత్ర్ కాల్ కాదు, మృత్ కాల్(చచ్చే కాలం)’ అని ఎందుకు అనగూడదు అంటూ మన్నార్ శ్రీనివాస్ అనే మరో ట్విటర్ యూజర్ స్పందించాడు. ‘కొందరికే మిత్ర్ కాల్.. అందరికి మృత్యు కాల్’ అని మాధవ్ అనే మరో యూజర్ రియాక్ట్ అయ్యాడు. ఇక మోదానీ (మోదీ, అదానీ)కి మాత్రమే అమృత కాలమని కొందరు, ‘మీరు చెప్పింది కరెక్ట్ రామన్నా’ అని మరి కొందరు, ‘పర్ఫెక్ట్ సార్’ అని ఇంకొందరు ఇలా రకరకాలుగా తమ రియాక్షన్లు తెలియజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

