ఉద్యోగానికి ఎంపిక.. తిరస్కరణ
వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారులు చేసిన తప్పి దం ఓ గిరిజన నిరుద్యోగ యువకుడి పాలిట శాపంగా మారింది. ఖానాపురం మండల కేంద్రానికి చెందిన పాలకుర్తి మహేందర్ స్పెషల్ ఎడ్యుకేషన్‌లో డీఎడ్ పూర్తిచేశాడు.
- డీఈవో నిర్వాకంతో టాప్ ర్యాంకర్‌కు దక్కని జాబ్
ఖానాపురం, జనవరి 3 : వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారులు చేసిన తప్పిదం ఓ గిరిజన నిరుద్యోగ యువకుడి పాలిట శాపంగా మారింది. ఖానాపురం మండల కేంద్రానికి చెందిన పాలకుర్తి మహేందర్ స్పెషల్ ఎడ్యుకేషన్‌లో డీఎడ్ పూర్తిచేశాడు. 2024లో స్పెషల్ ఎడ్యుకేషన్ (ఎస్జీటీ)లో డీఎస్సీ పరీక్ష రాయగా, జిల్లా స్థాయిలో 10వ ర్యాంకు వచ్చింది. మెరుగైన ర్యాంకు, రిజర్వేషన్ ఉండటం తో మహేందర్ ఉద్యోగానికి ఎంపికైనట్టు అధికారుల నుంచి సమాచారం అందిం ది.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ ముగిసిన అనంతరం కౌన్సెలింగ్ అండ్ పోస్టింగ్ కోసం మరోసారి పిలుపువచ్చింది. తీరా కౌన్సెలింగ్‌కు వెళ్లగా లిస్టులో పేరు లేదు. డీఈ వో జ్ఞానేశ్వర్‌ను అడగటంతో స్టేట్ ఆఫీసుకు సర్టిఫికెట్లు పంపిస్తే అనర్హుడిగా పేర్కొన్నరంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో తాను ఇగ్నోలో రెగ్యులర్‌గా, బెం గుళూరు యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో డీఎడ్ చేసినట్టు మహేందర్ తెలిపారు.
తనతోపాటు వివిధ జిల్లాల్లో చదివిన 20మంది అభ్యర్థులకు ఇదే డీఎస్సీ లో ఉద్యోగాలు వచ్చినట్టు ఆధారాలతో చూపాడు. దీంతో కంగుతిన్న డీఈవో తప్పిదం చేసినట్టు తెలుసుకొని మహేందర్‌కు ఉద్యోగం వచ్చేందుకు ప్రయత్నం చేస్తానని రోజూ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నాడు. ఇదే విషయమై మహేందర్ గతంలో కలెక్టర్ సత్యశారదను కలిశాడు. స్పందించిన కలెక్టర్.. డీఈవోను తన కార్యాలయానికి పిలిపించుకొని మహేందర్‌కు న్యాయం చేయాలని ఆదేశించారు. అయినా, 2 నెలలుగా ఉద్యోగం కోసం డీఈవో కార్యాలయం, స్టేట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. డీఈవో నిర్వాకంతోనే తనకు ఉద్యోగం రాలేదని మహేందర్ ఆరోపిస్తున్నాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

