చేనేతరంగ పరిరక్షణకు ఉద్యమించాలి
చేనేత పరిశ్రమ పరిరక్షణ కోసం చేనేత సంఘాల నాయకులు, కార్మికులు సంఘటితంగా ప్రభుత్వాలపై ఉద్యమించాలని పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం గోవర్ధన్, గంజ అంజయ్య, చింతకింది మల్లేశం పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో గురువారం చేనేత పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో చేనేత సంఘాల నాయకులు, కార్మికులు నేతన్న విగ్రహం నుంచి ఆచార్య కొండా లక్ష్మణ్‌బాపూజీ విగ్రహం వరకు భారీ ర్యాలీ తీశారు.
- ఇక్కత్ డూప్లికేట్ వస్ర్తాలను అడ్డుకోవాలి
- పద్మశ్రీ అవార్డు గ్రహీతల పిలుపు
- పోచంపల్లిలో నేతన్నల భారీ ర్యాలీ
భూదాన్‌పోచంపల్లి, జూలై 25 : చేనేత పరిశ్రమ పరిరక్షణ కోసం చేనేత సంఘాల నాయకులు, కార్మికులు సంఘటితంగా ప్రభుత్వాలపై ఉద్యమించాలని పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం గోవర్ధన్, గంజ అంజయ్య, చింతకింది మల్లేశం పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో గురువారం చేనేత పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో చేనేత సంఘాల నాయకులు, కార్మికులు నేతన్న విగ్రహం నుంచి ఆచార్య కొండా లక్ష్మణ్‌బాపూజీ విగ్రహం వరకు భారీ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీతలు మాట్లాడుతూ.. మిల్లుల్లో చేనేత ఇకత్ డిజైన్లతో డూప్లికేట్ వస్త్రాలు తయారుచేసి షాపింగ్ మాల్స్, దుకాణాల్లో తకువ ధరకు విక్రయిస్తుండటంతో చేనేత కార్మికులు వీధిన పడే పరిస్థితి నెలకొన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. కంపెనీల్లో ప్రింట్ అయ్యే ఇక్కత్ డిజైన్ వస్త్రాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఇక్కత్ డూప్లికేట్‌ను అరికట్టేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకురావాలని చేనేత, జౌళి శాఖ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్, రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ మునాసు వెంకటేశం మాట్లాడుతూ.. హైదరాబాద్ మారెట్లోకి గుజరాత్, సూరత్, ముంబై నుంచి పెద్దఎత్తున వస్త్రాలు దిగుమతి అవుతున్నాయని, షాపింగ్ మాల్స్‌లో ఇకత్ వస్త్రాలని చెప్పి ప్రింటింగ్ వస్త్రాలు తకువ ధరకు విక్రయిస్తుండటంతో చేనేత మారెట్ దెబ్బతింటున్నదని తెలిపారు.
సిరిసిల్ల బంద్ సక్సెస్
రాజన్న సిరిసిల్ల, జూలై 25 (నమస్తే తెలంగాణ): వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించి, ఆత్మహత్యలను నివారించాలని డిమాండ్ చేస్తూ నేతన్నలు ఇచ్చిన సిరిసిల్ల బంద్ గురువారం విజయవంతమైంది. వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ సంపూర్ణమైంది. వాణిజ్య, వ్యాపార వర్గాలు మద్దతు తెలిపాయి. అన్ని పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. ఆర్టీసీ బస్సులు కూడా సరిగా నడవలేదు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో చేపట్టిన రిలేదీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. బంద్‌లో భాగంగా నేతన్నలు సిరిసిల్ల నేతన్న చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. వందలాది మంది తరలి వచ్చి మానవ హారంగా ఏర్పడి నిరసన తెలిపారు. ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి కూరుకు పోయిందని, కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని నేతన్నలు డిమాండ్ చేశారు. నిరసనలో జేఏసీ నాయకులు ఆడెపు రవీందర్, మూషం రమేశ్, పంతం రవి, ఏనుగుల ఎల్లయ్య, స్కైలాబ్ బాబు, కోడం రమణ, రవి, దూడం శంకర్, సామల శ్రీనివాస్, పినగాని రాజేశం, గుంటి వేణు, మండల సత్యం పాల్గొన్నారు.
దీక్షకు సీపీఐ నేత చాడ సంఘీభావం
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని సీపీఐ కేంద్ర కమిటీ సభ్యుడు చాడ వెంకటరెడ్డి విమర్శించారు. నేతన్నలు చేపట్టిన రిలేదీక్షా శిబిరాన్ని గురువారం ఆయన సందర్శించి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మరమగ్గాలు బంద్ పడి వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. చేనేత బకాయిలు వెంటనే విడుదల చేయాలని, పవర్‌లూం సమస్యలు పరిష్కరించి కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నేతన్నల బతుకులు రోడ్డున పడుకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

