కూకట్‌పల్లిలో ఐదుగురు సభ్యులు గల డ్రగ్స్ ముఠా అరెస్టు
జల్సాలకు అలవాటు పడ్డ ఐదుగురు యువకులు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో డ్రగ్స్‌ను విక్రయిస్తూ పోలీసులకు చిక్కారు. వీరి వద్ద నుంచి 18 గ్రాముల ఎండీఎంఏ అనే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
మూసాపేట : జల్సాలకు అలవాటు పడ్డ ఐదుగురు యువకులు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో నగరంలో డ్రగ్స్‌ను విక్రయిస్తూ పోలీసులకు చిక్కారు. వీరి వద్ద నుంచి 18 గ్రాముల ఎండీఎంఏ అనే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం కూకట్పల్లి పోలీస్‌స్టేషన్‌లో బాలానగర్ జోన్ డీసీపీ శ్రీనివాస్‌రావు, ఏసీపీ చంద్రశేఖర్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
విజయవాడ, హైదరాబాద్‌కు చెందిన దాసరి హరికృష్ణ, నెమలికంటి పవన్‌కుమార్, జనగాం కిరణ్, రఘునందన సాంబమూర్తి , సాయికుమార్ అనే ఐదుగురు స్నేహితులు డ్రగ్స్‌ను విక్రయిస్తున్నారని తెలిపారు. బెంగుళూర్లో ప్రైవేటు జాబ్ చేస్తున్న సాయికుమార్ అనే యువకుడు బెంగళూరులో నైజీరియాకు చెందిన ప్రధాన డ్రగ్ సప్లయిర్ ఆలీతో పరిచయం అయ్యాడు. ఆలీ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసిన సాయికుమార్ హైదరాబాద్‌కు తీసుకువచ్చి స్నేహితులతో విక్రయిస్తున్నారని తెలిపారు.
కూకట్పల్లి ఐడీఎల్ చెరువు బేబిపాండ్ వద్ద మాదాపూర్ ఎస్ఓటీ , కూకట్పల్లి పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా అనుమానంగా కన్పించిన ఐదుగురిని పట్టుకుని తనిఖీలు చేశారు. దీంతో వారి వద్ద 18గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ లభించింది. వారి వద్ద నుంచి నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని డీసీపీ వెల్లడించారు.
కేసు నమోదు చేసుకుని వారిని అరెస్టు చేసిన రిమాండ్ కు తరలించినట్లు ఆయన తెలిపారు. నిందితులంతా యువకులేనని వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎప్పటికప్పుడూ కనిపెడుతూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో సీఐలు నర్సింగ్‌రావు, అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
Ramayana | రూ.5000 కోట్ల వసూళ్లు సాధిస్తేనే సేఫ్.. భయపెడుతున్న ‘రామాయణ’ బ్రేక్ ఈవెన్ టార్గెట్!
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

