Jangaon | భార్యపై కోపంతో కూతుళ్లకు విషమిచ్చిన తండ్రి.. జనగామలో దారుణం
Jangaon | భార్య మీది కోపంతో ఇద్దరు కూతుళ్లకు కూల్‌డ్రింక్‌లో కలిపి విషమిచ్చిన ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు శివారు జానకీపురం గ్రామంలో చోటుచేసుకొన్నది. భార్య ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల అదుపులో శ్రీను ఉన్నట్టు సమాచారం.
Jangaon | పాలకుర్తి రూరల్, ఏప్రిల్ 10: భార్య మీది కోపంతో ఇద్దరు కూతుళ్లకు కూల్‌డ్రింక్‌లో కలిపి విషమిచ్చిన ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు శివారు జానకీపురం గ్రామంలో చోటుచేసుకొన్నది. పెద్ద కుమార్తె మృతిచెందగా, చిన్న కూతురు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. వివరాళ్లోకెళ్తే.. గ్రామానికి చెందిన గుండె శ్రీను, ధనలక్ష్మి దంపతులకు కూతుళ్లు నాగప్రియ(09), నందిని(05), కుమారుడు వర్షిత్ తేజ (04)ఉన్నారు.
శ్రీను మేస్త్రీ పని చేసేవాడు. పెళ్లి నాటి నుంచి వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నెల 6న ధనలక్ష్మి హనుమకొండకు వెళ్లగా, భార్య మీది కోపంతో శ్రీను ఇద్దరు కుమార్తెలకు కూల్‌డ్రింక్‌లో విషం కలిపి తాగించి, అన్నం తినిపించాడు. చిన్నారుల పరిస్థితి విషమించడంతో శ్రీను జనగామ దవాఖానకు తరలించాడు. చికిత్స పొందుతూ నాగప్రియ సోమవారం మృతి చెందింది. మెరుగైన చికిత్సకు నందినిని హైదరాబాద్ గాంధీ దవాఖానకు తీసుకెళ్లారు. భార్య ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల అదుపులో శ్రీను ఉన్నట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

