Brutal murder | కరీంనగర్ జిల్లాలో విషాదం..దివ్యాంగుడి దారుణ హత్య
Brutal murder | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ దివ్యాంగుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రామడుగు మండలం తిరుమలపూర్ అనుబంధం కారుపాకులపల్లిలో దివ్యాంగుడు చామంతుల కొమురయ్య (60)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్టు ఎస్సై అంజయ్య తెలిపారు.
కరీంనగర్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ దివ్యాంగుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రామడుగు మండలం తిరుమలపూర్ అనుబంధం కారుపాకులపల్లిలో దివ్యాంగుడు చామంతుల కొమురయ్య (60)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్టు ఎస్సై అంజయ్య తెలిపారు.
సోమవారం తెల్లవారు జామున కొమురయ్య తల్లి మల్లమ్మ నిద్ర మేలుకొని చూడగా వికలాంగుడైన కొమురయ్య చనిపోయి ఉండడం గమనించింది. విషయాన్ని తన చిన్న కొడుకుకు తెలుపడతో అతడు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ రవీందర్, ఎస్సై అంజయ్య కొమురయ్య హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా , కారుపాకలపల్లిలో అదే గ్రామానికి చెందిన నీలం ఐలయ్య అనే వ్యక్తి పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. కొమురయ్యకు, ఐలయ్యకు మధ్య భూ వివాదమే హత్యకు కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టెన్త్‌లో టాపర్లకు ఢిల్లీ విమాన ప్రయాణ బహుమతి
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

