ఐసెట్‌లో అమ్మాయిలదే హవా!.. మొత్తంగా 91.22% మంది ఉత్తీర్ణత
రాష్ట్రంలోని ఆయా విశ్వవిద్యాలయాల్లో 2026-27 విద్యాసంవత్సారానికి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఐసెట్)-2026 ఫలితాలను శుక్రవారం హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ బాలకిష్టారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు విడుదల చేశారు.
హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ఆయా విశ్వవిద్యాలయాల్లో 2026-27 విద్యాసంవత్సారానికి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఐసెట్)-2026 ఫలితాలను శుక్రవారం హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ బాలకిష్టారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 56,206 మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 51,146 మంది అభ్యర్థులు హాజరైనట్టు అధికారు లు తెలిపారు.
ఇందులో 46,654 (91.22%) మంది అర్హత సాధించినట్టు అధికారులు వెల్లడించారు. 23,353 మంది అబ్బాయిలు, 27,793 మంది అమ్మాయిలు పరీక్షకు హాజరు అయ్యా రు. ఇందులో 21,191 మంది అబ్బాయిలు, 25,463 మంది అమ్మాయిలు క్వాలిఫై అయ్యారు. అబ్బాయిలు 90. 74%, అమ్మాయిలు 91.62% ఉత్తీర్ణత సాధించారు. ఐసెట్-2026లో అమ్మాయిలు హవా కొనసాగించారు. ర్యాంకు కార్డులను https://icet.tgc he .ac. in నుంచి పొందవచ్చని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో టీజీ ఐసెట్ చైర్మన్, ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, కన్వీనర్ అల్వాల రవి, కో కన్వీనర్ మిర్యాల రమేశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

